స్టార్ హీరోలకి సంబంధిచిన ప్రతి అంశం ప్రేక్షకులకి ఆసక్తి కలిగించేదే. ఇలాంటిది తమ అభిమాన హీరో కొత్త ఇంటిలోకి మారుతుంటే ఆ ఇంటి స్పెషల్ ఏంటి అనే కోరిక అభిమానుల్లో ఉండటం చాలా సాధారణం.ఇందుకే ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో యష్ కొత్త ఇంటికి సంబంధించి చాలా వార్తలు బయటకి వస్తున్నాయి.
యష్ అతని భార్య రాధిక పండిట్ తో కలసి ఈ గురువారం నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో లాంఛనంగా జరిగిన పూజా కార్యక్రమంలో యష్ దంపతులు మెరిసిపోయారు. యష్ ప్రకాశవంతమైన నారింజ పట్టు చొక్కా .. ఆఫ్ వైట్ ధోతిని ఎంచుకున్నాడు. రాధిక పండిట్ నారింజ – నీలం పట్టు చీరలో అదరకొట్టింది.
నిజానికి ఈ గృహ ఇంకా పూర్తి కాలేదు. కొన్ని ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. కానీ.., ముహూర్తం బాగుండటంతో యష్ పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ పనులు పూర్తయిన వెంటనే యష్ – రాధిక పండిట్ జంట కొత్త ఇంట్లోకి మారనున్నారు. యష్ దంపతులు తమ ఇంటిని బెంగుళూరులోని చాలా కాస్ట్లీ ఏరియాలో నిర్మించుకున్నారు.ఇక ఇంటీరియర్ కోసం రాధిక పండిట్ లావిష్ గానే డిజైన్లను సెలెక్ట్ చేసుకోవడం విశేషం. అలాగే.., పాలరాతి ఫ్లోరింగ్, ఫ్రెంచ్ స్టైల్ కిటికీలతో ఇల్లు పూర్తిగా తెలుపు రంగులో పెయింట్ చేయబడింది. ఇవన్నీ కలపి చూస్తే.., యష్ ఈ లగ్జరీ హౌస్ కోసం సుమారు రూ.100 కోట్ల పైగానే ఖర్చు పెట్టి ఉంటాడన్న చర్చ నడుస్తోంది. ఇక యష్ కేజీఎఫ్ 2 రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.