మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ను ప్రకటించారు. వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ఒక కొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ సినిమా పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. విభిన్నమైన పాత్రలు, కొత్త తరహా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ అదే కోవలో ఒక కొత్త తరహా ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.