హీరోయిన్ రష్మిక మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నటికి మొన్న హాట్ వీడియోతో రెచ్చిపోయిన ఈ భామ.. ఇప్పుడు చిట్టిపొట్టి గౌన్ తో కేక పుట్టించింది. కానీ ట్రోలర్స్ మాత్రం ఈమెని వదలట్లేదు.
హీరోయిన్ రష్మిక గ్లామర్ విషయంలో బౌండరీలు చెరిపేస్తోంది. ఎక్కడా కూడా అస్సలు మొహమాటపడట్లేదు. చిన్న చిన్న డ్రస్సులు వేసుకుని పెద్ద పెద్ద న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే జరిగింది. ప్రస్తుతం హిందీలో బిజీ అవుతున్న రష్మిక కు బాలీవుడ్ నీరు బాగా వంటబట్టినట్లుంది. డ్రస్సింగ్ స్టైల్ మారింది. డ్రస్ సైజ్ తగ్గింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియోనే వైరల్ గా మారింది. ఓ అవార్డు ఫంక్షన్ లో భాగంగా కార్పెట్ పై నడిచిన రష్మిక.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కన్నడ బ్యూటీ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్. ‘కిరాక్ పార్టీ’తో నటిగా మారిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో పాటు మిడ్ రేంజ్ హీరోలతోనూ యాక్ట్ చేసి హిట్స్ కొట్టింది. రీసెంట్ గా ‘వారసుడు’తో సక్సెస్ అందుకున్న ఆమె చూపు ఇప్పుడంతా బాలీవుడ్ పైనే ఉంది. అమితాబ్ ‘గుడ్ బై’తో గతేడాది థియేటర్లలోకి వచ్చిన రష్మిక.. కొన్నిరోజుల ముందు ‘మిషన్ మజ్ను’తో ప్రేక్షకుల్ని అలరించింది. మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటించేందుకు డిస్కషన్స్ జరుగుతున్నాయి.
‘రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలి’ అనే సామెతని రష్మిక బాగా గుర్తుపెట్టుకున్నట్లు కనిపిస్తుంది. సౌత్ లో ఉన్నప్పుడు గ్లామర్ విషయంలో కాస్త బౌండరీస్ పెట్టుకున్న ఈ భామ.. బాలీవుడ్ కు వెళ్లేసరికి వాటిని కాస్త పక్కనపెట్టిందా అనిపిస్తుంది. చేసిన రెండు సినిమాల్లోనూ నార్మల్ లుక్ లో కనిపించింది. కానీ తాజాగా జరిగిన ఓ మూవీ అవార్డ్ ఫంక్షన్ లో మాత్రం బ్లాక్ కలర్ చిట్టిపొట్టి గౌన్ వేసుకుని వచ్చింది. థైస్ కనిపించడం, నడుము దగ్గర పలచగా ఉండేలా డ్రస్ వేసుకోవడం చూసిన పలువురు నెటిజన్స్.. రష్మికని ట్రోల్ చేస్తున్నారు. ‘బాలీవుడ్ గాలి బాగానే తగిలింది’, ‘మరీ ఇంతలా అవసరమా’ అని మాట్లాడుకుంటున్నారు. మరి రష్మిక తాజా డ్రస్సింగ్ పై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
#RashmikaMandana during Zee Cine Awards red carpet 💃📷🔥😍 @viralbhayani77 pic.twitter.com/8F6u0JEGWU
— Viral Bhayani (@viralbhayani77) February 27, 2023