మెగాపవర్ స్టార్ రామ్ చరణ్… ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. కమల్ తో ‘భారతీయుడు 2’ షూటింగ్ మళ్లీ మొదలు కావడంతో.. RC15 షూట్ కాస్త నెమ్మదిగా నడుస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో సాంగ్ చిత్రీకరణలో ఉన్నారు. ఇక చరణ్ కొత్త సినిమా ఏంటా అని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇక వాటికి ఎండ్ కార్డ్ పడింది. గతంలో ప్రకటించినట్లు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో మూవీ కాకుండా కొత్త దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’తో వచ్చిన క్రేజ్ దృష్ట్యా, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. తారక్.. కొరటాల సినిమాకు ఎప్పుడో ఓకే చెప్పేశాడు. ఇప్పటికీ దాని షూటింగ్ మొదలవట్లేదు. త్వరలో స్టార్టయ్యే ఛాన్సు కనిపిస్తుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో తారక్ కలిసి పనిచేస్తాడు. ఈ రెండు ప్రాజెక్టులే ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్నాడు. అయితే ‘ఉప్పెన’ హిట్ అయిన తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ అది సెట్ కాలేదు. దీంతో బుచ్చిబాబు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. ఇదే టైంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఓ స్టోరీ చెప్పి, ప్రాజెక్ట్ ఫైనల్ చేసేశాడు.
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కంటే రామ్ చరణ్, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్నిరోజుల క్రితమే అది ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. అధికారికంగా చెప్పలేదు కానీ దాదాపు ఆ ప్రాజెక్టుని సైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్థానంలోనే బుచ్చిబాబు ప్రాజెక్టు వచ్చినట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తీసే ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత నుంచి మొదలుకానున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ కూడా కాస్త సహాయం చేసినట్లు తెలుస్తోంది. వీలైనంత వేగంగా ఈ సినిమాను పూర్తిచేసి వచ్చే ఏడాది సెప్టెంబరు చివరలో రిలీజ్ చేస్తారని సినీ వర్గాల్లో టాక్. మరి రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. ఈ కాంబోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Excited about this !!
Looking forward to working with @BuchiBabuSana & the entire team.@vriddhicinemas @SukumarWritings #VenkateshSatishKilaru @MythriOfficial pic.twitter.com/eYXdH7YBVd
— Ram Charan (@AlwaysRamCharan) November 28, 2022