యావత్ ఇండియన్ సినిమా.. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ కోసం వెయిట్ చేస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ మూవీ విడుదల కాబోతుంది. అయితే.., ఇంకా ట్రిపుల్ ఆర్ షూట్ పూర్తి కాలేదు. జక్కన్న ప్రస్తుతం యన్టీఆర్, రామ్ చరణ్ పై పతాక సన్నివేశాలను ఉక్రెయిన్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే.., తాజాగా ట్రిపుల్ ఆర్ సెట్ లో యన్టీఆర్ చేసిన పనికి రామ్ చరణ్ అసహనం చెందాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
సెట్ లో కామ్ గా కూర్చున్న చరణ్ వద్దకి వచ్చిన ఎన్టీఆర్.. చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ అయిందా అని అడగగా, చరణ్ బల్లపై డ్రమ్స్ వాయిస్తూ అయిపోయిందంటూ తారక్ కి సమాధానమిచ్చాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.., ఎదురుగా ఉన్న కార్తికేయ నవ్వడంతో చరణ్ ఫోకస్ అటువైపు వెళ్ళింది.
ఈ సందర్భంగా రామ్ చరణ్ కార్తికేయతో మాట్లాడుతూ.. రియల్ డ్రమ్స్ ఏవి..? డ్రమ్స్ లేవు, కాస్ట్యూమ్స్ లేవు, ఏమి లేవు.., పొద్దునే ఇక్కడ కూర్చొబెట్టారు. దసరాకు రిలీజ్ డేట్ ఉంది. ఆ విషయం మీకు గుర్తుందా అంటూ అసహనం వ్యక్తం చేశారు చరణ్. అయితే.., పుల్ల పెట్టిన తారక్ మాత్రం నెమ్మదిగా అక్కడ నుండి జారుకున్నాడు. ట్రిపుల్ ఆర్ టీమ్ సరదాగా ప్లాన్ చేసిన ఈ వీడియో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.