సినిమా ఇండస్ట్రీలో జరిగే గొడవలు పెద్దగా బయటకు రావు. ఒక్కసారి వస్తే మాత్రం అవి ఎప్పటికీ తేలవు. టాలీవుడ్ అయినా.. బాలీవుడ్ అయినా సరే ఇందులో పెద్దగా మినహాయింపు ఉండదు. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ల మధ్య జరుగుతున్న గొడవ మాత్రం ముదిరి ముదిరి పాకాన పడుతోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలైతే… మరీ ఇలా తయారయ్యారేంట్రా అనుకునేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అనగానే గొడవలే గుర్తొస్తాయి.
బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్, తనని లైంగికంగా వేధించాడని హీరోయిన్ షెర్లిన్ చోప్రా ఆరోపించింది. ఈ విషయమై రాఖీ మాత్రం సాజిద్ ని సపోర్ట్ చేస్తోంది. ‘అతడిని వేధించింది చాలు, ఇప్పటికే సాజిద్ శిక్ష అనుభవిస్తున్నాడు. అవకాశాలు కోల్పోయాడు. ఇకపై కూడా విమర్శిస్తే ఆత్మహత్య చేసుకుంటాడు’ అని రాఖీ సావంత్.. షెర్లిన్ చోప్రాకు కౌంటర్ ఇచ్చింది. ఈ విషయం నచ్చకపోవడంతో.. ‘ఏం మాట్లాడుతున్నావ్. జిమ్ కి వెళ్లి కండలు పెంచుకో లేదంటే నీ బాయ్ ఫ్రెండ్స్ నీతో టైం పాస్ చేసి వెళ్లిపోతారు. నీకు పనిచేయడం కంటే మీడియా ముందు వాగడమే ఇష్టం’ అని షెర్లిన్ రిటర్న్ పంచ్ వేసింది.
దీంతో రాఖీ సావంత్ ఫుల్ ఫైర్ అయిపోయింది.’అరికాలి నుంచి తల వరకు మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఆమె నా గురించి మాట్లాడుతోంది. ఆ వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేయడమే ఆమె పని. నీకు నా గురించి మాట్లాడే అర్హత లేదు’ అని రాఖీ సావంత్ బాంబ్ పేల్చింది. ఇక ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలీవుడ్ వరకే కాకుండా తెలుగు నెటిజన్స్ కూడా చూస్తున్నారు. మరీ ఇలా తయారయ్యేంట్రా బాబు అని నవ్వుకుంటున్నారు.