మల్టీప్లెక్స్ లో కేవలం రూపాయికే స్పెషల్ షో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. పూర్తిగా చదివేయండి. అసలు విషయం తెలుసుకోండి.
మల్టీపెక్స్ లో సినిమా చూడటమనేది చాలామందికి ఓ డ్రీమ్! ఎందుకంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ తో పోలిస్తే, మల్టీప్లెక్స్ లో సదుపాయాలు, పిక్చర్ & సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటాయి. టికెట్ రేట్స్ మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండవు. అందుకే జనాలు అక్కడికి వెళ్లేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అప్పుడప్పుడు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఆయా మల్టీప్లెక్స్ లు ఆఫర్స్ పెడుతుంటుంది కానీ అవి పెద్దగా వర్కౌట్ కావడం లేదేమో! దీంతో ఈసారి ఏకంగా రూ.1కే స్పెషల్ షో అని అనౌన్స్ మెంట్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే… ఒకప్పటితో పోలిస్తే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్ల సంఖ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. ఏదైనా మూవీ రిలీజైతే, టాక్ బట్టి చూడటానికి వెళ్తున్నారు. దీంతో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు, ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసేందుకు సరికొత్త ప్లాన్స్ వేస్తున్నాయి. అందులో భాగంగానే రూ.1కే మల్టీప్లెక్స్ లో స్పెషల్ షోని అనౌన్స్ చేశారు. మీరనుకంటున్నట్లు.. ఇందులో సినిమాలు వేయరు. కేవలం ఓ అరగంటపాటు కొత్త సినిమా ట్రైలర్స్ మాత్రమే ప్రదర్శిస్తారు. ఈ విషయాన్ని పీవీఆర్ ఐనాక్స్ కో-CEO అలోక్ టాండన్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఏప్రిల్ 7-10వ తేదీ వరకు ఈ ట్రైలర్ షోని ముంబయిలో ప్రదర్శించగా.. 35 వేల మందికి పైగా చూసేందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే దేశంలోని మిగతా చోట్ కూడా ఈ ట్రైలర్ షోని ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా.. రిలీజ్ కు రెడీగా ఉన్న 10 సినిమా ట్రైలర్స్ ని ఎంపిక చేసి బిగ్ స్క్రీన్ పై ప్రదర్శిస్తారు. వీటిలో ఆయా ప్రాంతీయ భాషతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ ట్రైలర్స్ ని వేస్తారు. ‘ట్రైలర్ స్క్రీనింగ్ షో’ కాన్సెప్ట్ లో భాగంగా పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ లు రోజులో ఓ షోని కేవలం ట్రైలర్స్ కోసం కేటాయించనున్నారు. అరగంటసేపు సెలెక్ట్ చేసిన ట్రైలర్స్ ని కేవలం ఒక్క రూపాయికే ప్రదర్శిస్తారు. దీన్నిబట్టి చూస్తుంటే ఎంచక్కా ఓ రూపాయికే ఏసీలో కూర్చొని మల్టీప్లెక్స్ అనుభూతిని ఎంజాయ్ చేయొచ్చనమాట. దీని గురించి ఫుల్ డీటైల్స్ తెలియాల్సి ఉంది. మరి రూ.1కే స్పెషల్ షో కాన్సెప్ట్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
ఈ టికెట్స్ ని ఆన్ లైన్ తోపాటు డైరెక్ట్ గా పీవీఆర్, ఐకాన్స్ వెబ్ సైట్, కౌంటర్ దగ్గర కొనుగోలు చేయొచ్చు.