కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం.. దక్షిణాది సినిమా ఇండస్ట్రీని శోకసంద్రంలోకి నెట్టింది. పునీత్ చేసిన సినిమాలు, చేసిన సమాజిక సేవ అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన విషయం అందరికీ తెలుసు. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్ రాజ్ కుమార్. తెలుగు ఇండస్ట్రీ తారలు, సెలబ్రిటీలు సైతం పునీత్ రాజ్ కుమార్ చివరి చూపు కోసం బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పునీత్ రాజ్ కుమార్ ప్రస్తావనే వినిపిస్తోంది. వాటిలో ఒక ఫేస్ బుక్ పోస్టు ఒకటి బాగా వైరల్ అవుతోంది.
రియల్ మోషన్ పోస్టర్..
సినిమా భాషలో మోషన్ పోస్టర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పోస్టులో అభిమానులు రియాలిటీలో మోషన్ పోస్టర్‌ను చేసి చూపించారు. పునీత్ భారీ కటౌట్‌ను డాన్సు చేస్తున్నట్లు తయారు చేశారు. మూన్ వాక్ చేస్తున్న పునీత్ రాజ్ కుమార్ కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది బంగళూరు సిటీకి శివారులో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రియేటివిటీ చూసి పునీత్ ఫ్యాన్స్‌కు హేట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. మరి ఆ వైరల్ పోస్టును మీరు చూసేయండి.