ఎల్బీ శ్రీరామ్ అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్. డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ తో కడుపుబ్బా నవ్వించిన ఆయన.. తాజాగా ఎమోషనల్ స్పీచ్ తో ఏడిపించేశారు!
ఎల్బీ శ్రీరామ్.. ఈ పేరు ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. ఒకవేళ అడిగినా సరే ఆయన ఎవరు? అని అంటారు. 90స్, అంతకంటే ముందు పుట్టినవారిని అడిగితే.. ఎల్బీ శ్రీరామ్ ఏ రేంజ్ కమెడియన్ అనేది టక్కున చెప్తారు. అద్భుతమైన పాత్రలు, అంతకు మించిన వండర్ ఫుల్ యాక్టింగ్ తో ఫుల్ గా ఎంటర్ టైన్ చేశారు. ఇక 2010 తర్వాత కొత్త జనరేషన్ హాస్య నటులు ఇండస్ట్రీలోకి రావడంతో ఎల్బీ శ్రీరామ్ కు సినిమాల్లో ఛాన్సులు రావడం తగ్గిపోయింది. అలా అని ఆయనేం బాధపడలేదు. కొత్త దారి వెతుకున్నారు. తాజాగా ఆయన ఇచ్చిన స్పీచ్ ఎమోషనల్ చేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లో ఛాన్సులు తగ్గిపోవడం, అదే టైంలో యూట్యూబ్ ట్రెండ్ పెరిగింది. దీన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకున్న ఎల్బీ శ్రీరామ్.. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ నిర్మించారు. అలా ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో టచ్ లోనే ఉంటూ వచ్చారు. గతేడాది ఈయన నటించిన ‘కవిసామ్రాట్’ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అయింది. తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’లో ఓ పాత్రలో నటించారు. తాజాగా ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. అందులో ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఎమోషనల్ చేసేశారు.
ఇక ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. తన రెండో ఇన్నింగ్స్ లో తోడ్పడుతున్న నిర్మాత అల్లు అరవింద్ కు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. తన ‘కవిసామ్రాట్’ మూవీ రిలీజ్ విషయంలో ఎంతో సహయపడిన ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ఇక తన జనరేషన్ కమెడియన్స్ ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు అందరూ చనిపోయారని, తాను మాత్రం సినిమాలు చేస్తున్నానని గుర్తుచేసుకున్నారు. ఇలా దాదాపు 6 నిమిషాల పాటు మాట్లాడిన ఎల్బీ శ్రీరామ్.. చాలా సరదాగా కొన్ని విషయాలు చెబుతూ అందరినీ ఎమోషనల్ చేసి ఏడిపించేశారు. ఇదే ఈవెంట్ కోసం ఆయన కుర్రాడిలా రెడీ అయి రావడం విశేషం. మరి ఎల్బీ శ్రీరామ్ స్పీచ్ పై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.