తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుర్రోడు జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. గత కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.
ఓ వైపు వెండితెరపై హీరోగా నటిస్తూనే.. బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటుతున్నాడు ఎన్టీఆర్. ఆ మద్య మా టీవిలో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కి హూస్ట్ గా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం జెమినీ టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్ కి హూస్ట్ గా వ్యవహరిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ షో తొలి ఎపిసోడ్‌కి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరై తెగ సందడి చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే ఫ్రేములో కనిపించే సరికి ఫ్యాన్స్ కూడా తెగ మురిసిపోయారు. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి రాజమౌళి, కొరటాల శివ రాబోతున్నారు. ఇందులో దర్శకులు ఇద్దరు రోల్ కెమెరా, యాక్షన్ అని చెబుతుండగా, ఎన్టీఆర్ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. అనంతరం ఇక్కడ లొకేషన్ నాది, డైరెక్షన్ నాది. నేనే బాస్ ఇక్కడ అంటూ ఎన్టీఆర్ సీరియస్ గా డైలాగ్స్ కొట్టడంతో ఇద్దరు డైరెక్టర్లు షాక్ అయ్యారు.
సెప్టెంబర్ 20న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా, ఇది మంచి టీఆర్పీ రాబట్టనుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు డైరెక్టర్లు ఎన్టీఆర్ అంటే ఎంతగానో అభిమానించేవారు.. ఆయనకు కూడా వీరితో ఎంతో బాండింగ్ ఉంది. రాజమౌళితో ఎన్టీఆర్ స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాలు చేశాడు. ఇక కొరటాలతో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే.
Can’t Wait 😻😻
Next Week @tarak9999 🔥#EvaruMeeloKoteeswarulu#ManOfMassesNTR pic.twitter.com/SMuIn0uAGY
— Troll NTR Haters (@TrollNTRHaterz) September 16, 2021