స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాయి. బాహుబలి, బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ విజయం అందుకుంది ఆర్ఆర్ఆర్ చిత్రం. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
దేశంలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మానియా కొనసాగుతుంది. భారతీయ సినీ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు ఎస్ ఎస్ రాజమౌళి. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ తో ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కించారు. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేయడమే కాదు.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ఆస్కార్ ముంగిట నిలిచింది భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో దేశం మురిసిపోతుంది. ఈ సందర్భంగా ఆస్కార్ వేదికపై పాట పాడిన కాలభైరవ, రాహూల్ సిప్లిగంజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా వరల్డ్ టాప్ సింగర్ రిహన్నాను కలిసి వారి సంతోషాన్ని సోషల్ మాద్యమాల్లో షేర్ చేసుకున్నారు.
తెలుగు పాట కమ్మదనం, సాంప్రదాయం, హషారు యావత్ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ‘నాటు నాటు’ సాంగ్ కి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఆనంద క్షణాలను తలచుకుంటుంటే ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా ఉప్పొంగిపోయారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ కి అభినందన వెల్లువలు కొనసాగుతున్నాయి. కాగా, నాటు నాటు కి ఆస్కార్ రావడంపై వరల్డ్ టాప్ మోస్ట్ సింగర్ రిహన్నా ఆర్ఆర్ఆర్ టీమ్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా, ఆస్కార్ బరిలో నాటు నాటతో పాటు వరల్డ్ లోని టాప్ సింగర్స్ అంతా పోటీపడ్డారు.. వారిలో అమెరికా టాప్ సింగర్ రిహన్నా ఒకరు. ఈ ఏడాది ఆస్కార్ బరిలో వాకండా ఫర్ ఎవర్ మూవీలోని ‘లిప్ట్ మీ అప్’ పాట ఆస్కార్ బరిలో నిలిచింది. కానీ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు గెలుచుకుంది.
ఇక అమెరికా టాప్ సింగర్ రిహన్నా కెరీర్ లో 230 కు పైగా అవార్డులు గెల్చుకుంది.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా బద్దలు కొట్టింది. తాను పోటీలో గెలవకున్నా.. ఆర్ఆర్ఆర్ టీమ్ ని అభినందించింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ టీమ్ నాటు నాటు సాంగ్ సింగర్స్ అయిన కాలభైరవ, రాహూల్ సిప్లిగుంజ్ తో పాటు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ లను కలిసి ఫోటోలు కూడా దిగింది. ఈ ఆనంద క్షణాలను కాలభైరవ, రాహూల్ సిప్లిగుంజ్ తమ ఇన్ స్ట్రాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాహూల్ ‘నేను ఇవాల చాలా గొప్పమనసున్న మహిళను కలిశాను.. ఎంత ఎదిగినా మనం ఒదిగి ఉండాలనే విషయాన్ని ఆమెను చూస్తే అర్థం అవుతుంది.. నేను ఇంకా షాక్ లోనే ఉన్నా’ అంటూ పోస్ట్ చేశాడు.