కమెడియన్ సుధాకర్ వందలాది చిత్రాల్లో హీరోగా, కమెడియన్ గా రాణించి గుర్తింపు పొందారు. ప్రేక్షకులకు హాస్యాన్ని పంచుతూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత అనారోగ్యానికి గురై నటనకు దూరమయ్యారు. తాజాగా తన కొడుకు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ప్రముఖ కమెడియన్, నటుడు సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో హీరోగా నటించి ఓ వెలుగు వెలిగిన నటుడు సుధాకర్. తన నటనతో, హాస్యంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. హీరోగా చేసిన అనంతరం కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. వందలాది చిత్రాల్లో నటించిన ఆయన ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా సాగుతున్నక్రమంలో అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమ్యారు నటుడు సుధాకర్. ఇటీవల ఓ ఛానల్ లో ప్రసారమైన ప్రొగ్రాంలో పాల్గొని అప్పటి రోజులను గుర్తు చేశారు.
బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో. ఒకప్పుడు స్టార్ యాక్టర్ గా రాణించి, అందరి మన్ననలను పొందిన నటుడు సుధాకర్ అనారోగ్యంపాలై నటనకు దూరమయ్యారు. జీవితం అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని దాటుకుని ముందుకు సాగుతేనే విజయం వరిస్తుంది. అలా చాలామంది నటీనటులు కెరీర్ లో ఓటమి చవిచూసినా మళ్లీ ప్రయత్నించి గెలిచి నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నటుడు సుధాకర్ విషయంలో కూడా అలాగే జరిగింది. మొదట హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన తరువాత కాలంలో కమెడియన్ గా దూసుకుపోయారు. అయితే ఈ మధ్య ఓ ప్రొగ్రాంలో పాల్గొన్న ఆయన తన కొడుకు గురించి పలు ఆసక్తికర విషయాలు వెళ్లడించారు.
నటుడు సుధాకర్ నిర్మాతగా, హీరోగా, కమెడియన్ గా పనిచేశారు. ఆయన తన కొడుకు గురించి చెప్తూ.. నటుడు సుధాకర్ కు పెళ్లైన చాలా ఏళ్ల వరకు సంతానం కలగ లేదని చెప్పారు. సంతానం కోసం చేయని ప్రయత్నం లేదని తెలిపారు. ఒకానొక సందర్భంలో మద్రాస్ లో ప్రముఖ చర్చిలో ప్రార్థనలు చేయగా సంతానం అందిందని తెలిపారు. ఆ అద్బుతంతోనే జీసస్ కు కృతజగా తన కొడుకుకు (బెన్ని) బెనెడిక్ మైఖేల్ అని పేరు పెట్టామని తెలిపారు. బెన్ని గాడ్ గిఫ్ట్ సన్ అని, తను పుట్టిన తరువాత అన్ని విధాల కలిసొచ్చిందని వెల్లడించారు. కొడుకు పుట్టిన తరువాత క్రైస్తవ మతంలోకి మారినట్లుగా తెలిపారు. ఇక ఈ మధ్యే బెన్నీ చదువు పూర్తి చేసుకుని సినిమా రంగంలోకి రావాలని తర్ఫీదు తీసుకుంటున్నాడు. నటుడు సుధాకర్ మాట్లాడుతూ.. చిరంజీవి నాకు మంచి మిత్రుడని.. తన కొడుకు బాధ్యతను చిరంజీవి గారే తీసుకుని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని చెప్పుకొచ్చారు.