టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికీ కూడా తన ఆట తీరుతో ఐపీఎల్ లో సత్తా చాటుతూ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు సారధిగా కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన టీ20కి సైతం ధోనీ మెంటర్ గా టీమిండియాకు సేవలు అందించాడు. ఇదిలా ఉంటే ధోనీ గురించి తాజాగా కొన్ని ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇక విషయం ఏంటంటే..? ధోనీతో నటి రాయ్ లక్ష్మీ గతంలో లవ్ ట్రాక్ అంటూ చాలా ఏళ్ల క్రితం అనేక వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరు కొంత కాలం డేటింగ్ కూడా చేశారని, ఆ తర్వాత విడిపోయారంటూ వార్తలు శిఖారు చేశాయి. తాజాగా వీరిద్దరి బ్రేకప్ గురుంచి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి లక్ష్మీ రాయ్ సంచలన నిజాలు బయటపెట్టింది. తమిళ్ తో పాటు తెలుగులో మంచి పాలోయింగే ఏర్పరుచుకున్న రాయ్ లక్ష్మీ 2008లో ధోనీతో ప్రేమయాణం జరిపినట్లు తెలిపింది.
మీమిద్దరం 2008-09 కాలంలో డేటింగ్ చేశామని, ఆ తర్వాత ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నామని వివరించింది. ఇక ఇదే కాకుండా ధోనీతో నేను విడిపోయిన ఘటన నా జీవితంలో తుడిచిపోని మచ్చలా మారిపోయిందని, ఇప్పటికీ ఆ క్షణాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయని రాయ్ లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. మా ఇద్దరి రిలేషన్ లో ఒకరికొకరం అర్థం చేసుకుని సామరస్యంగానే విడపోయామని, ధోనీతో బ్రేకప్ తర్వాత నాకు అనేక బ్రేకప్ లు జరిగాయని కానీ నేనుప్పుడు కూడా బాధపడలేదని ఆమె రాయ్ లక్ష్మీ తెలిపింది. ఇప్పటికీ ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్ ఉంటుందని ఆమె వివరించే ప్రయత్నం చేసింది. తాజాగా ధోనీతో బ్రేకప్ గురించి నటి రాయ్ చెప్పిన నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.