చిన్నప్పుడు రస్నా యాడ్‌లో నటించి, రస్నా బేబీగా పాపులర్ అయిన అంకితను ‘లాహిరి లాహిరి లాహిరిలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయం చేశారు దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి. ఫస్ట్ ఫిలింతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
చిన్నప్పుడు రస్నా యాడ్‌లో నటించి, రస్నా బేబీగా పాపులర్ అయిన అంకితను ‘లాహిరి లాహిరి లాహిరిలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయం చేశారు దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి. ఫస్ట్ ఫిలింతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్రం సంచలనం విజయం సాధించింది. ‘ధనలక్ష్మీ ఐ లవ్యూ’, ‘ప్రేమలో పావని కళ్యాణ్’ తర్వాత చేసిన ‘సింహాద్రి’ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. దాంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇంకేముంది, స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారు. కట్ చేస్తే.. ‘సింహాద్రి’ తర్వాత నటించిన ఏ సినిమా కూడా సరైన విజయం సాధించలేదు. దీంతో క్రమంగా చిత్ర పరిశ్రమకు దూరమైంది. ఓ కన్నడ, మూడు తమిళ్ సినిమాలు కూడా చేసింది.
2016లో విశాల్ జగతాప్ అనే వ్యక్తిని పెళ్లాడింది. మ్యారేజ్ అయ్యాక నటనకు స్వస్తి చెప్పి భర్తతో కలిసి న్యూజెర్సీలో సెటిలయ్యింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. దీంతో ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయిపోయింది నటి అంకిత. రీసెంట్‌గా సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వూలో తన సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. ‘ప్రేమ పెళ్లి తర్వాత న్యూజెర్సీలో సెటిల్ అయ్యి, భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయిపోయానని చెప్పారు. తమ లవ్ స్టోరీ రివీల్ చేశారు.
2015లో మొదటిసారిగా తనను చూశానని, ఫస్ట్ తనే ప్రపోజ్ చేశానని చెప్పారు. మంచి ఆఫర్ వస్తే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇద్దరూ బాబులే ఉన్నారు. పాప లేకపోవడం కాస్త బాధగా ఉందని.. ఒక కూతురంటే బాగుండేదని.. పెద్దబాబు KG, రెండోబాబు 1 ఇయర్ ఓల్డ్, పెద్దబ్బాయి నీల్ తన సినిమాలు చూస్తుంటాడని అన్నారు. అలాగే తమ ఫ్యామిలీ డైమండ్ బిజినెస్ చేస్తారని, భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు అంకిత.