సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు వివిధ కారణాలతో కన్నుమూశారు. మరి కొందరు ప్రమాదాలకు గురయ్యారు.
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు వివిధ కారణాలతో కన్నుమూశారు. మరి కొందరు ప్రమాదాలకు గురయ్యారు. ‘టైటానిక్’ లేవ్ పాల్టర్, కన్నడ సీనియర్ డైరెక్టర్ సీవీ శివశంకర్ వంటి వారు మృతి చెందారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు మరణించారు. ఈ వార్తతో శాండల్‌వుడ్ ఇండస్ట్రీ షాక్‌కి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ కన్నడ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ సీవీఎన్ మోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. ఆదివారం (జూలై 2) బెంగుళూరులోని తన నివాసంలో మోహన్ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.
మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మోహన్ కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించి నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. బెంగుళూరులో పాపులర్ ఊర్వశి మరియు నవరంగ్ థియేటర్ స్థాపించారు. అలాగే కొన్ని చిత్రాలకు పంపిణీ దారుడిగా వ్యవహరించారు. మోహన్ గతకొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. కాగా ఏడాది క్రితం మోహన్ సోదరుడు కేసీఎన్ చంద్రశేఖర్ మరణించారు. ఆ దు:ఖం నుండి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇంతలోనే మోహన్ కన్నుమూయడంతో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా నివాళులర్పిస్తున్నారు.