గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది సిని పరిశ్రమకు తీరని దుఖఃన్ని మిగిల్చి దిగ్గజ నటులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ ఏడాది మొదలు స్టార్ నటీనటులు కన్నుమూశారు.
ఇటీవల సినీ ఇండస్ట్రలో వరుసగా ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది టాలీవుడ్, బాలీవుడ్ లో దిగ్గజ నటులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో వరుస విషాదాలు జరిగాయి. తాము ఎంతగానే సినీ నటులు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ పంజాబ్ నటుడు అమృత్ పాల్ చోటూ కన్నుమూశారు. ప్రముఖ పంజాబీ నటులు సిద్ధూ మూసేవాలా, దల్జీత్ కౌర్, గురీందర్ డింపీ మరణాల తర్వాత ఇండస్ట్రీలో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన అమృత్ పాల్ చనిపోవడంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఆయన మరణ వార్త గురించి పంజాబీ ఫిల్మ్ అండ్ టీవీ యాక్టర్స్ అసోసియేషన్ వారి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అమృత్ పాల్ చోటూ సర్దార్జీ, సర్దార్ జీ 2తో పాటు పలు చిత్రాల్లో నటించి మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు కొన్ని టీవీ సీరియల్స్ కూడా నటించారు. అమృత్ పాల్ చోటూ మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అమృత్ పాల్ చోటూ పంజామ్ మూవీస్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా పలు హిట్ చిత్రాల్లో తనదైన కామెడీ పండించారు. కరోనా సమయం నుంచి సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు జరుగుతున్నాయి.. కొంత మంది నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర రంగానికి చెందిన వారు కరోనా భారిన పడి కన్నుమూశారు. మరికొంత మంది సీనియర్ నటులు అనారోగ్య కారణాల వల్ల చనిపోతే.. కొంతమంది ప్రమాదాల వల్ల కన్నుమూశారు. ఏది ఏమైనా తాము ఎంతగానో అభిమానించే నటులు చనిపోయిన వార్త తెలుసుకొని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.