చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. పంజాబీ నటుడు , సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మంగళవారం ఢిల్లీకి సమీపంలోని కుండ్లీ – మానేశర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దీప్ సిద్దూ మరణించారు. మంగళవారం రాత్రి హర్యానాలో సోనిపట్ సమీపంలో ఆగి ఉన్న లారీని దీప్ సిద్ధూ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు.
1984లో పంజాబ్‌లోని ముక్తసర్‌లో జన్మించిన ఆయన న్యాయవాద విద్యను అభ్యసించారు. కింగ్‌ఫిషర్ సంస్థ నిర్వహించిన మోడల్ హంట్‌లో విజేతగా నిలిచిన సిద్ధూ.. ఆ తర్వాత గ్రాసిమ్ మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొని గ్రాసిమ్ మిస్టర్ పర్సనాలిటీ, గ్రాసిమ్ మిస్టర్ టాలెంటెడ్‌గా గెలిచారు. ‘రమ్తా జోగి’, ‘దేశీ’, ‘సాదే ఆలే’ వంటి చిత్రాలలో నటనకు దీప్ సిద్ధూ మంచి పేరు సంపాదించారు. అతని వయసు 37 సంవత్సరాలు.
2021లో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా రైతులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న దీప్ సిద్ధూ.. చారిత్రక ఎర్రకోటపై మతపరమైన జెండా ఎగురవేసినందుకు రైతు సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో సిద్ధూ, గ్యాంగ్‌స్టర్ లఖా సిధనాలపై పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు. హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నటుడు దీప్ సిద్ధూ మరణాన్ని సోనిపట్ పోలీసులు ధ్రువీకరించారు. దీప్ సిద్ధూ మృతితో అతడి అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
Punjabi actor Deep Sidhu dies in a road accident near Sonipat in Haryana, confirms Sonipat Police. Details awaited.
He was also earlier named as an accused in the 2021 Red Fort violence case. pic.twitter.com/CoLh8ObkJJ
— ANI (@ANI) February 15, 2022