కొంతకాలంగా చిత్రపరిశ్రమను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ప్రముఖ నటులు, దర్శకులు.. ఇలా ప్రముఖుల మరణవార్తలను సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, దర్శకుడు గురీందర్ డింపీ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 47 ఏళ్ళు కాగా.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అమ్మీ విర్క్, సిద్ధూ మూస్‌వాలా, గిప్పీ గ్రేవాల్ లాంటి ప్రముఖులతో గురీందర్ వర్క్ చేశారు. అయితే.. నటనతో పాటు దర్శకుడిగా, రచయితగా ఎన్నో పంజాబీ సినిమాలతో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు గురీందర్.
ఇక గురీందర్ మరణవార్తతో ఇండస్ట్రీలో విషాదఛాయలు నెలకొన్నాయి. లాంగ్ లాచి, జఖ్మీ, క్యారీ ఆన్ జట్టా 2, వధైయాన్ జీ వధైయాన్, ఉడా ఐదా లాంటి అనేక పాటలు, సినిమాలలో ముఖ్య పాత్రలు పోషించాడు. అలాగే లవ్ యు బాబీ, కబడ్డీ ఏక్ మొహబ్బత్, పంజో లాంటి కొన్ని సూపర్ హిట్ పంజాబీ చిత్రాలకు దర్శకత్వం వహించారు గురీందర్. ఇక నటుడు, దర్శకుడు మాత్రమే కాకుండా గురీందర్ కొన్ని సినిమాలకు డైలాగ్స్, సాంగ్స్ కూడా రాయడం విశేషం. ఇటీవల సిద్దూ మూసేవాలా ఆల్బమ్ లో కూడా గురీందర్ కీలకపాత్ర పోషించాడని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. గురీందర్ డింపీ ఏ కారణంగా చనిపోయాడు అనే వివరాలు బయటికి రాలేదు. కానీ.. గురీందర్ హఠాన్మరణంతో సినీ వర్గాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాయి. దీంతో చిత్రపరిశ్రమ ఓ టాలెంటెడ్ ఆర్టిస్ట్, డైరెక్టర్ ని కోల్పోయిందని ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మరోవైపు గురీందర్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సోషల్ మీడియాలో సినీ ప్రేక్షకులు, అభిమానులు గురీందర్ మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
Punjabi actor & director Gurinder Dimpy passes away at 47 #punjabiactor #director #gurinderdimpy #gurinderdimpypassesaway pic.twitter.com/kCBOl6F7Xh
— ਪੀਟੀਸੀ ਨਿਊਜ਼ | PTC News (@ptcnews) November 7, 2022