టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా కూడా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు అలీ. ఒకప్పుడు విడుదలైన ప్రతి తెలుగు సినిమాలో అలీకి కనిపించేవాడు. ఆయన కామెడీ లేకుండా సినిమా వినోదాత్మకంగా ఉండదు అని ఆడియన్స్ భావించే వారు. అయితే ఈ మధ్యకాలంలో అలీ వెండితెరపై అరుదుగా కనిపిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది అనే డౌట్ చాలామందిలో ఉండే ఉంటుంది. ఇక తాజాగా ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలీ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు.
F3 సినిమా మే 27వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అలీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అలీ మాట్లాడుతూ..”సినిమాలో నటించక పోవడానికి కారణం తెలియజేస్తూ.. ప్రస్తుతం చిన్నచిన్న సినిమాల్లో కూడా మాకు క్యారెక్టర్లు ఇస్తున్నారు. కథ ఏంటో చెప్పకుండా డేట్స్ తీసుకుంటారు. తీరా సినిమా చేసిన తర్వాత ఇలాంటి సినిమాలో అలీ ఎందుకు నటించారని ప్రేక్షకులు అనుకోకుంటారు. అందుకే అలా సినిమాలు చేయడం తగ్గించేశాను. ముందుగా కథ వివరించి నా పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తాను. ప్రాధాన్యత లేని పాత్రలు చేయను. ప్రస్తుతం డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి కోసమే ‘ యమలీల’ సీరియల్ చేస్తున్నాను.
ఇదీ చదవండి:మలయాళం ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలుఎస్వీ కృష్ణారెడ్డి స్టార్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో అందరు వద్దంటున్నా ఆయన నన్ను హీరోగా పెట్టి యమలీల సినిమా చేశారు. ఆయన చెప్పారంటే ముందు వెనకా ముందూ ఆలోచించకుండా చేస్తాను అందుకే ఇప్పుడు యమలీల సీరియల్ చేశాను” అని అలీ తెలిపారు. ఇటీవలే ఓ నేపాలీ సినిమాకి సంతకం చేశారంటా. అయితే ఆ నేపాలీ సినిమా వివరాలు ఏమీ వెల్లడించలేదు. ఒకప్పుడు నార్త్ వాళ్లను తీసుకొచ్చి నటన, భాష నేర్పించి మరీ డబ్బు ఇచ్చేవారు తెలుగు దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడు ఉత్తరాది పరిశ్రమకి టాలీవుడ్ సత్తా ఏమిటో బాగా తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు మేం ఇండియన్ స్టార్స్‌గా మారాం అంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు అలీ. మరి..అలీ చెప్పిన ఈ ఆసక్తికర విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.