తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు కలర్స్ స్వాతి. టీవీ షోస్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో కథానాయికగా బిజీ అయిపోయింది.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు కలర్స్ స్వాతి. టీవీ షోస్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో కథానాయికగా బిజీ అయిపోయింది. నాని పక్కన ‘అష్టా చమ్మా’ మూవీలో నటించింది. ఈ సినిమాకు నంది అవార్డు కూడా వరించింది. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. కొంత గ్యాప్ అనంతరం ముఖానికి మళ్లీ మేకప్ వేసుకుంది. అయితే తాజాగా స్వాతి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే, ఆమె కొద్ది రోజుల నుంచి తన భర్త వికాస్‌కు దూరంగా ఉంటుందట. భర్త ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించడమే దానికి ప్రధాన కరాణమంటున్నారు.
ఇటువంటి కారణాలకు సంబంధించి గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. సమంత, నాగ చైతన్యతో విడిపోతునట్లు అనుమానం వచ్చేలా తన పేరు ముందు అక్కినేనితో పాటు, ఇన్‌స్టా నుంచి వారిద్దరున్న ఫోటోస్ తీసేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్లిదరు విడాకులు తీసుకున్నారు. ఈ మధ్య విడాకులు తీసుకున్న నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విషయంలో కూడా ఇదే జరిగింది. తాజాగా కలర్స్ స్వాతి తన భర్త ఫోటోలు డిలీట్ చేయడంతో.. ఈ జంట కూడా విడిపోతుందని పలు యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రెండు సంవత్సరాల క్రితం కూడా స్వాతి విడాకులు తీసుకున్నట్లు ఇలాగే వార్తలు వైరల్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఫోటోలు ఎందుకు లేవో అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది.
భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆర్కైవ్‌లో దాచుకున్నానంటూ తన ఫోన్లో ఉన్న పిక్స్ చూపించింది. ఫోటోలన్ని కలిపి ఒక వీడియో కూడా చేసింది. దాని తర్వాత విడాకుల పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. కానీ మళ్లీ స్వాతి విషయంలో ఇదే ప్రచారం జరుగుతుంది. 2018లో మలయాళం కుటుంబానికి చెందిన పైలెట్ వికాస్ వాసును స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత వీరిద్దరు థాయిలాండ్‌లో సెటిల్ అయ్యారు. అప్పట్లో సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్లీ 2019 లో మళయాలం, తెలుగులో కూడా నటించింది. ఇప్పుడు వీరిద్దరు విడిపోతున్న ప్రచారానికి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవమేంటనేది స్వాతి చెప్తే కానీ తెలియదు.