ఈ మధ్య సినిమా సెలబ్రిటీలతోపాటు యూట్యూబర్స్ కూడా చాలా పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో లోకల్ బాయ్ నాని ఒకడు. వైజాగ్ లో ఉండే ఈ కుర్రాడు.. చేపలు పడుతూ ఉంటాడు. అందుకు సంబంధించి బోట్ లో చేపలు ఎలా పడతారు? ఎలా అమ్ముతారు? లాంటి వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఎప్పటిలానే ఈసారి కూడా వీడియో చేశాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు బిగ్ బాస్ సొహైల్ కూడా వెళ్లాడు. కానీ అనుకోని ప్రమాదం జరగడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా యూట్యూబర్స్ కూడా కనిపిస్తున్నారు. వాళ్లతో చిట్ చాట్ చేయడం, భోజనం చేస్తూ మాట్లాడటం లాంటి వాటిని సెలబ్రిటీస్ చేస్తున్నారు. ఇప్పుడు లోకల్ బాయ్ నానిని కలిసేందుకు ‘బిగ్ బాస్’ ఫేమ్ సొహైల్ వైజాగ్ వెళ్లాడు. ప్యూర్ మాస్ గా కనిపించేందుకు పంచె కట్టి, తలకు గుడ్డ కూడా చూట్టాడు. నానితో కలిసి బోట్ లో సముద్రంలోకి సొహైల్ వెళ్లాడు. వల వేయడం, చేపలు పట్టడం లాంటివి వాటిని నాని, సొహైల్ కు దగ్గరుండి చూపించాడు.
అయితే పడవ చివర్లో నిల్చునే క్రమంలో సొహైల్ పట్టుతప్పి సముద్రంలో పడిపోయాడు. దీంతో వెంటనే నాని కూడా సముద్రంలో దూకేసి సొహైల్ ని సేవ్ చేశాడు. ఇదంతా సడన్ గా జరిగిపోయేసరికి బోట్ లో ఉన్నవాళ్లు ఒక్కసారిగా కంగారూ పడిపోయారు. సొహైల్ తో వచ్చిన వ్యక్తి అయితే అతడి పేరు గట్టిగా అరుస్తూ భయపడిపోయాడు. నాని వెంటనే దూకి రక్షించినప్పటికీ.. సొహైల్ మోకాళ్లపై గట్టిగా దెబ్బలు తగిలాయి. రక్తం కూడా కారిపోయింది. ఈ మొత్తాన్ని నాని లేటేస్ట్ గా అప్ లోడ్ చేసిన వీడియోలో చూపించాడు. మరి సొహైల్ సముద్రంలో పడిపోవడం, నాని సేవ్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.