సినిమా ఇండస్ట్రీలో లవ్, రిలేషన్, డేటింగ్, పెళ్లి, విడాకులు వంటివి కామన్. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణం గురించి ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వస్తాయో తెలిసిందే.
సినిమా ఇండస్ట్రీలో లవ్, రిలేషన్, డేటింగ్, పెళ్లి, విడాకులు వంటివి కామన్. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణం గురించి ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వస్తాయో తెలిసిందే. శృతి హాసన్, ఇలియానా లాంటి హీరోయిన్స్ పెళ్లికి ముందే డేటింగ్ చేస్తూ న్యూస్ రాసుకోవడానికి మంచి స్టఫ్ ఇస్తున్నారు. రీసెంట్గా ఈ లిస్ట్‌లో ఓ హీరో హీరోయిన్ పేర్లు వచ్చి చేరాయి. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. వాళ్లెవరో కాదు.. అభిమన్యు దస్సాని, శ్రేయా ధన్వంతరి. ‘ప్రేమ పావురాలు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి భాగ్యశ్రీ. చాలా కాలం తర్వాత ప్రభాస్ ‘రాధే శ్యామ్’ తో రీ ఎంట్రీ ఇచ్చారు.
భాగ్యశ్రీ కొడుకే ఈ అభిమన్యు దస్సాని. హిందీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి, 2018లో ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ (Mard Ko Dard Nahi Hota) మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈమధ్య సల్మాన్ ఖాన్ – పూజా హెగ్డేల ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయా ధన్వంతరితో కలిసి ‘నౌసిఖియే’ (Nausikhiye) అనే ఫిలిం చేస్తున్నాడు. రీల్ లైఫ్ రొమాన్స్‌ని కాస్తా రియల్ లైఫ్‌లోకి తీసుకొచ్చేశాడని టాక్. ఇటీవల భోపాల్‌లో నెల రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ టైంలోనే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారట. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతున్నారట. ఎప్పటిలానే ఈ వార్త వైరల్ అవుతున్నా ఎవరూ రెస్పాండ్ కాలేదు.
ఒకవేళ ఇది గాసిప్ అనుకుంటే ‘నిప్పు లేనిదే పొగ రాదు’ అనే సామెతను గుర్తు చేసుకోవాలి అంటున్నారు బాలీవుడ్ వర్గాల వారు. అభిమన్యు కంటే శ్రేయా రెండేళ్లు పెద్దది. మనోడు 1990 ఫిబ్రవరి 21న పుట్టాడు. శ్రియా 29 ఆగస్ట్ 1988 డేట్ ఆఫ్ బర్త్. ఇక శ్రేయా ధన్వంతరి విషయానికొస్తే.. నాగ చైతన్య ఫస్ట్ ఫిలిం ‘జోష్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ‘స్నేహగీతం’ తో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత హిందీ ఇండస్ట్రీకి వెళ్లిపోయి సినిమాలు, టీవీ, వెబ్ సిరీస్, యాడ్స్ చేస్తూ బిజీ అయిపోయింది.