ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ తారలకు, వారి అభిమానులకు మధ్య ఉన్న గ్యాప్ తగ్గించుకోవడానికి సోషల్ మాద్యమాలు ఎక్కువగా వాడుతున్నారు. సెలబ్రెటీలు ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టా లలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. కొన్ని సార్లు సెలబ్రెటీలకు ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న సమయంలో చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఇబ్బందే అక్కినేని హీరో సుశాంత్ కి ఎదురైంది. ఆయన నెటిజన్స్‌తో ముచ్చటించగా, ఆయనకు ఓ నెటిజన్ నుండి ఊహించని ప్రశ్న ఎదురయింది. దానికి ఏమాత్రం నొచ్చుకోకుండా చాలా కూల్ గా సమాధానం ఇచ్చాడు.
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుశాంత్ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో మంచి పేరు సంపాదించాడు. ఎలాంటి పాత్రల్లో అయినా నటించడానికి సిద్దం అంటున్నాడు సుశాంత్. నెటిజన్స్ తో చిట్ చాట్ చేస్తున్న సమయంలో విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ఓ నెటిజన్ ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు అన్న ప్రశ్నకు తాను ఉన్న లొకేషన్ ని పంపించాడు. మీరు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారన్న ప్రశ్నకు డౌట్ గా ఉన్న ఓ సింబల్ ని పెట్టాడు.
ఇది కూడా చదవండి: Swiggy Boy: వైరల్ వీడియో: ట్రాఫిక్ పోలీస్ ఓవరాక్షన్.. అకారణంగా స్విగ్గీ బాయ్‌పై దాడి..
సిక్స్ ప్యాక్‌లో మిమ్మల్ని ఎప్పుడు చూస్తామంటే.. పాత్ర డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తానని అన్నాడు. ‘మీకు మౌంటైన్స్ అంటే ఇష్టమా..? లేక బీచ్ లా..?’ అని అడగ్గా.. బీచ్ లో ఉన్న ఫొటోను షేర్ చేశాడు సుశాంత్. ఓ నెటిజన్ ‘ఆర్ యూ వర్జిన్..?’ అంటూ సబంధంలేని ప్రశ్న అడిగాడు. సుశాంత్ కూల్‌గా నేను నిప్పు అని అర్థం వచ్చేలా ఓ దీపం ఫొటో పెట్టాడు. ప్రస్తుతం ఆ నెటిజన్ అడిగిన ప్రశ్న వైరల్ అవుతోంది. ఇక హీరో మాస్ మహరాజ రవితేజ గురించి మీ అభిప్రాయం గురించి చెప్పండి అనగా.. ఆయన మంచి హృదయం ఉన్న వ్యక్తి అని జవాబు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: వీడియో: కాళ్లుచేతులు కట్టేసి.. బిడ్డను ఎర్రటి ఎండలో పడేసిన తల్లి!
ఇక అక్కినేని నాగార్జున తనయులు చైతూ, అఖిల్ లో ఎవరు ఇష్టం అనే ప్రశ్నకు సారీ.. మీరు అడిగిన ప్రశ్నే తప్పు అన్నాడు. ‘కాళిదాసు’, ‘కరెంట్’, ‘అడ్డా’ వంటి సినిమాలతో అలరించిన సుశాంత్ సోలో హీరోగానే కాదు.. ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు సిద్దమవుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.