సెలబ్రిటీలు తమ స్టార్ డమ్ కి తగ్గట్లు అన్ని సౌకర్యాలు ఉండాలని అనుకుంటారు. అలాంటి వాటిల్లో ఇళ్లు కూడా ఒకటి. దాని కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. సొంత ఇల్లు లేదా అద్దె ఇల్లు ఏదైనా వారి అభిరుచికి తగినట్లు ఉండే ఇంటిని ఎంపిక చేసుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కొత్త ఇంట్లో చేరనుంది. ఇందులో ఆశ్చర్యం ఏముందని మీరు అనుకోవచ్చు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ హీరోయిన్ ఓ కొత్త ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఆ ఇంటికి నెలకు అద్దె రూ.12.5 లక్షలు. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరు అనేక కదా మీ సందేహం.
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్.. ఒకప్పుడు తన అందాలతో కుర్రకారు మనస్సులను కొల్లగొట్టిన హీరోయిన్. ఆమె త్వరలో కొత్త ఇంట్లోకి మారనున్నట్లు టాక్. ముంబైలోని పోష్ ఏరియాలోని వొర్లిలో ఓ అపార్ట్ మెంట్ లో నటి మాధురీ దీక్షిత్, శ్రీరామ్ నేనే అద్దెకు దిగబోతున్నారు. సకల హంగులతో విలాసవంతంగా ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లో నివసించేందుకు వారు నెలకు రూ.12.5 లక్షలు అద్దె కట్టనున్నట్లు సమాచారం.ఈ బ్యూటీపుల్ కపుల్ ఉండబోయే ఇంటి డిజైనర్ అపూర్వ ప్రాష్ మాట్లాడుతూ..”అపార్ట్‌మెంట్‌లోని 29వ అంతస్థులో మాధురి దంపతుల ఫ్లాట్ ఉంది. వారు దీనికి ఎలాంటి మార్పులు చేయాలనుకోకుండా యధాతథంగా ఉంచాలనుకుంటున్నారు” అని తెలిపాడు. ఆ ఇంటికి సంబంధించిన పిక్స్ ను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.