నటి సన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ కొన్నాళ్ల ముందు రిలీజైన ఓ వెబ్ సిరీస్ లో మాత్రం ఓ రొమాంటిక్ సీన్ లో అద్భుతంగా నటించింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ.. ఎందుకు చేయాల్సి వచ్చిందో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
యాక్టర్స్ అన్న తర్వాత నటించాలి. కాదు కాదు జీవించాలి. అప్పుడే ప్రేక్షకులు దానికి కనెక్ట్ అవుతారు. రిలీజై ఎన్నేళ్లయినా సరే సందర్భం వచ్చిన ప్రతిసారి.. ఆ సినిమా గురించి లేదా సీన్ గురించి ఆసక్తితో మాట్లాడుకుంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. నటి సన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల నుంచి నటిస్తున్న ఆమె.. తెలుగులో దాదాపు 600పైగా సినిమాలు చేసింది. కెరీర్ లో మిగతా రోల్స్ సంగతి ఏమో గానీ ‘మెట్రో కథలు’ వెబ్ సిరీస్ లో ఓ రొమాంటిక్ సీన్ మాత్రం ఇరగదీసిందనే చెప్పాలి. బిగ్ బాస్ ఫేమ్ అలీరెజా.. ఆ సీన్ లో కెమిస్ట్రీ నెక్స్ట్ లెవల్లో పండించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సీన్ పై సన క్లారిటీ ఇచ్చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓటీటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత తెలుగులో వచ్చిన నేచురల్ వెబ్ సిరీసుల్లో ‘మెట్రో కథలు’ ఒకటి. ఇందులోని ఓ ఎపిసోడ్ లో భర్తవల్ల చాలా ఇబ్బందిపడే గృహిణి పాత్రలో సన నటించింది. సీన్ లో భాగంగా అలీరెజా ఈమె భర్తకి యాక్సిడెంట్ చేస్తాడు. హాస్పిటల్ కి వచ్చిన ఆమె.. చూసి నడపలేవా? అని అలీ చెంపపై లాగిపెట్టి కొడుతుంది. చావుబతుకుల మధ్య ఉన్న తాగుబోతు భర్తని చూసి ఎమోషనల్ అవుతుంది. అయితే అలీ చేసిన దాంట్లో తప్పు లేదని తెలుసుకుని పశ్చాత్తాపడుతుంది. అలా అనుకోకుండా ఇంటికి వెళ్లడానికి రెడీ అయి తన కారు ట్రబుల్ ఇవ్వడంతో ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అలీ అంటాడు. ఆ తర్వాత ఆకలి వేస్తుందని అలీరెజా కూడా సన ఇంటికి వెళ్తాడు. తన బాధ మొత్తం సన.. అలీతో చెప్పుకుంటుంది. ఆ తర్వాత ఓ సందర్భంలో ఇద్దరూ ఒక్కటవుతారు. శృంగారంలోనూ పాల్గొంటారు. సిరీస్ గురించి ఏమో గానీ ఈ సీన్ గురించి అయితే అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. తాజాగా దీనిపై సన ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
‘నేను ఆ రోల్ చేయడానికి కారణం డైరెక్టర్ కరుణ కుమార్, రైటర్ ఖాదీర్ బాబు. ‘మెట్రో కథలు’ సిరీస్ లో నేను చేసిన స్టోరీలో.. మిడిల్ క్లాస్ మహిళ ఎంత స్ట్రగుల్ అవుతుందనేది చూపించారు. తాగుబోతు భర్త ఇంట్లో ఉండి, భార్యని పట్టించుకోకపోతే.. బయట జనం ఏం మాట్లాడుకుంటారు. ఇంటి బాధ్యతలతో పాటు.. లోలోపల కోరికలు కూడా కలుగుతూ ఉంటాయి. ప్రస్తుతం జరిగే వాటినే సిరీస్ లో చూపించారు. ఆ పాత్రని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. మంచి మెసేజ్ ఉంది. మంచి ప్రొడక్షన్ హౌస్. అలా ఈ పాత్ర చేయాల్సి వచ్చింది. నా రోల్ చూసి ఆ వయసులో ఉన్న చాలామంది మహిళలు కనెక్ట్ అవుతారు. తను కావాలని తప్పు చేయదు. అనుకోకుండా అలా జరుగుతుంది. చిన్న వీక్ మూమెంట్ లో చేసిన తప్పు అది. ఆ తప్పు నాకు నచ్చింది కాబట్టి ఒప్పుకొన్నాను. అది మెసేజ్. ఇలా జరుగుతుంది కూడా. నన్ను చూసి ఇన్ స్పైర్ అవుతారని ఆ రోల్ చేశాను. ఇలాంటి స్టఫ్ ఉన్న రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను.’ అని సన చెప్పుకొచ్చింది. మరి ఈ నటి చెప్పిన దానిపై మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.