అమ్మ అనే పిలుపు లోని మాధుర్యం.. అమ్మ అయ్యాకే తెలుస్తుంది.ప్రతి ఆడవారి జీవితంలో అమ్మ అనే పిలుపు అనేది ఓ మధురమైన మాట. బిడ్డకు జన్మనిచ్చి, వారి చేత అమ్మ అని పిలిచించుకున్నప్పుడే ఆడవారి జీవితానికి పరిపూర్ణత కలుగుతుంది. అలా అమ్మ అని పిలిపించుకుకోవడం ఆషామాషి కాదు. మహిళ పురిటి నొప్పుల బాధను ఎంతో భరించి బిడ్డకు జన్మనిస్తుంది. అయితే ప్రసవం అనేది మళ్లీ ఇంకో జన్మ ఎత్తడం లాంటిదే. అయితే పురిటీ నొప్పులు గురించి తాజాగా హీరోయిన్ ప్రణీత తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ప్రసవం సమయంలో తనపడిన వేదన, డెలివరీ చేసిన డాక్టర్ల గురించి తెలిపింది.
ఇటీవల తల్లి కాబోతున్న విషయాన్ని ప్రణీత సోషల్ మీడియా ద్వారా ప్రకటించిఅప్పుడప్పుడు తన బేబీ బంప్ ఫొటోలతో కనువిందు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో నటి ప్రణీత శుభాష్. అయితే ప్రసవం సమయంలో తాను పడిన బాధగురించి చెప్పుకొచ్చింది. జూన్ 10 రాత్రి 8.00 గంటల సమంయలో ప్రణీత తనకు పండంటి బిడ్డ పుట్టిందని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. అయితే అభిమానులు ప్రణీతకు కంగ్రాట్స్ చెబుతూ కామెట్స్ చేశారు. ఈక్రమంలో ఓ నెటిజన్ మాత్రం ఆమెను డెలివరీకి సంబంధించిన విషయాన్ని అడిగేశారు.. మీది నార్మల్ డెలివరీనా? అని నెటిజన్ అడగడంతో ప్రణీత సమాధానం ఇచ్చింది. అవును! సాధారణ ప్రసవమే.. అయితే దాదాపు పన్నెండు గంటలు ఈ ప్రసవ వేదనను అనుభవించాను అని చెప్పేసింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలోని అనాథాశ్రమాలన్నింటిలో అన్నదానం.. నయన్ విఘ్నేష్ గొప్ప మనసు
“పాప పుట్టినప్పటి నుంచి నాకు అంతా కలగా అనిపిస్తోంది. నా తల్లి గైనకాలజిస్ట్ గా ఉండటం నా అదృష్టం. అయినా మానసికంగా మాత్రం ఆమెకు నా ప్రసవం చాలా కష్ట సమయం. డాక్టర్ సునీల్ ఈశ్వర్, అతడి టీమ్ నాకు డెలివరీ బాగా జరిగేలా చూశారు. డాక్టర్ సుబ్బు, అతడి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ స్టోరీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది ప్రణీత. మరి.. తన ప్రసవ వేదనపై నటి ప్రణీత తెలిపిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.