సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజును అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశంలో జరుపుకోవాలని కోరుకుంటారు. ఇక సెలబ్రెటీలు తమ పుట్టిన రోజు వేడుకలు స్టార్ హోటల్స్, రీసార్ట్స్ లో ఘనంగా జరుపుకుంటారు. కానీ ఓ నటి మాత్రం ఇందుకు విరుద్దంగా తన పుట్టిన రోజు వేడుకను భయానక స్మశానవాటికలో జరుపుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నటి ఆర్యా ఘారే మంగళవారం మహారాష్ట్ర పుణె జిల్లా పింప్రీ చించ్వడ్లోని ఓ స్మశాన వాటికలో తన పుట్టిన రోజు వేడుకను సహచరులతో జరుపుకుంది. ఈ పుట్టిన రోజు వేడుకకు కొందరు దర్శకులు, నిర్మాతలు, స్నేహితులతో పాటు తన తల్లి కూడా హాజరయ్యింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసింది. అయితే మూఢనమ్మకాలపై వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఆమె ఇలా చేసింది. అంతేకాదు పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తితో శ్మశానవాటికలో చెట్లను పంచారు.
బాలీవుడ్, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో ఆర్యా ఘారే పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మద్య సునీల్ షెట్టి-తమన్నా నటించిన ‘ఏఏ బీబీ కేకే’ సహా మరికొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించింది ఆర్యా ఘరే. పుట్టిన రోజు వేడుకను స్మశానంలో జరుపుకొని మూఢనమ్మకాలపై ఆమె ఇచ్చిన సందేశానికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.