ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నా.. వారిలో అమలాపాల్ మాత్రం చాలా ప్రత్యేకం. రీల్ లైఫ్ లో ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలలో నటిస్తూ ముందుకి వెళ్లే ఈ బ్యూటీ.. రియల్ లైఫ్ లో కూడా అంతే విలక్షణంగా ఉంటుంది. ఇక సమాజంలో జరిగే చాలా విషయాలపై కూడా అమలాపాల్ స్పందిస్తూనే ఉంటుంది. ఇక.. సినిమాల్లో టాప్ రేంజ్ లో ఉండగానే డైరెక్టర్ విజయ్‌ను పెళ్లాడింది ఈ కేరళ క్యూటీ. కానీ వీరి పెళ్లి బంధం ఎక్కువకాలం నిలవలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో చాలా తక్కువ కాలంలోనే విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి అమలాపాల్ ఆలోచనా విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇక తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన అమలాపాల్ తన రెండో పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేసింది.
ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు అంతా తమ అభిమానులతో చిట్ చాట్ చేస్తూ, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.., ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అమలా పాల్ కూడా తాజాగా ఇలాంటి ఓ చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో భాగంగా ” మిమ్మల్ని వివాహం చేసుకోవాలంటే ఎలాంటి అర్హత ఉండాలి? అని ఓ నెటిజన్ అమలాని ప్రశ్నించాడు. దీనికి హీరోయిన్ నుండి ఊహించని సమాధానం వచ్చింది. “అసలిప్పుడు మరో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకుని, మరింత ఉన్నతంగా మార్చుకునే పనిలో ఉన్నాను.
నన్ను పెళ్లి చేసుకోవాలంటే అతనిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ఇప్పుడైతే చెప్పలేను. కానీ.., త్వరలోనే దానికి బదులిస్తాను” అని చెప్పుకొచ్చింది. ఇలా.. అమలాపాల్ తన రెండో పెళ్లిపై నోరు విప్పడంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి. అమలా పాల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tollywood beauty Amala Paul pic.twitter.com/FGabqjznJQ
— Subhash Shirdhonkar (@4331Subhash) July 6, 2022