తెలుగు హీరోల్లో కొందరు ఒక సినిమా చేయడానికి ఏళ్లు తీసుకుంటే.. కొందరు మాత్రం ఈజీగా ఏడాది నాలుగైదు మూవీస్ చేసేస్తారు. అలాంటి వారిలో ఇతడు కూడా ఒకడు. మరి ఎవరో గుర్తుపట్టారా?
అతడి తండ్రి అద్భుతమైన నటుడు, తాత కూడా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇద్దరు బాబాయిలు కూడా గత కొన్నాళ్లలో బాగా పాపులర్ అయ్యారు. ఇక వాళ్ల వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న సదరు హీరో.. ఇండస్ట్రీలోకి వచ్చి 12 ఏళ్లకు పైనే అయిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త నెమ్మదిగా సినిమాలు చేశాడు గానీ ఇప్పుడు మాత్రం యమ ఫాస్ట్ గా నటించేస్తున్నాడు. ఇండస్ట్రీలో స్టార్స్ తోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. కెరీర్ పరంగా చూసుకుంటే గతేడాది ఏకంగా ఐదు వరకు సినిమాలు రిలీజయ్యాయి. ఇక ఈ ఏడాది కూడా అంతకంటే ఒకటి ఎక్కువ తీసుకొచ్చేలా కనిపిస్తున్నాడు. మరి ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా?
ఇక విషయానికొస్తే.. పైన ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న పిల్లాడు వేరే ఎవరో కాదు హీరో ఆది. ప్రముఖ నటుడు సాయికుమార్ కొడుకు. 2011లో ‘ప్రేమకావాలి’తో అద్భుతమైన హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఏడాది ‘లవ్ లీ’ అని మరో చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఆ తర్వాత వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అవి థియేటర్లలోకి, ఓటీటీలోకి వస్తూనే ఉన్నాయి కానీ చెప్పుకోదగ్గ చిత్రాలైతే పెద్దగా ఏం లేవు. యాక్టింగ్ పరంగా కాస్త ఇంప్రూవ్ చేసుకుని సరైన డైరెక్టర్స్ చేతిలో పడితే ఆదికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ అలా జరగడం లేదేమో అనిపిస్తుంది. ఈ విషయంలో ఆది కాస్త దృష్టి పెడితే బెటర్.
గతేడాది ఏకంగా ఐదు సినిమాల వరకు రిలీజ్ చేసిన హీరో ఆది.. వాటిలో ఒక్కటంటే ఒక్కదానితోనూ హిట్ కొట్టలేకపోయాడు. ఇక ఈ ఏడాది ‘CSI సనాతన్’, ‘జంగిల్’, ‘కిరాతక’, ‘అమరన్ ఇన్ ద సిటీ’ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవన్నీ కూడా దాదాపుగా ఈ ఏడాదిలోపే థియేటర్లలోకి రావడం కన్ఫర్మ్. ఇవి కాకుండా మరిన్ని కొత్త మూవీస్, ఈ లిస్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదిలా ఉండగా ఇప్పటికే పెళ్లి చేసుకున్న ఆదికి ఓ పాప ఉంది. సరే ఇదంతా పక్కనబెడితే.. చిన్నప్పుడు ఆదిని చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.