“30 వెడ్స్ 21”.. ఈ వెబ్ సిరీస్ తెలియని వారు ఉండరు. ఈ సిరీస్ యూట్యూబ్ సెన్సేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో పృథ్వి, మేఘన మధ్య జరిగే సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి. “30 వెడ్స్ 21” వెబ్ సీరిస్ సూపర్ హిట్ అవ్వడంతో, ఇందులో నటించిన వారిగి మంచి గుర్తింపు వచ్చింది. ఈ వెబ్ సీరీస్ పై ఏకంగా రాజమౌళి నుంచి కూడా ప్రశంసలు వచ్చాయంటే అనన్య రీచ్ ఎంత వరకు వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ఇందులో హీరోయిన్ గా నటించిన అనన్య అయితే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో.. ఇప్పుడు ఈ అమ్మడికి హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వాలంటూ ఏకంగా నెటిజన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. దీంతో.., అనన్య వరుస ఇంటర్వూస్, షోల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయిపోయింది.
తాజాగా ఓ ఛానల్ లో ప్రసారం కానున్న “బోనాల సంబరాలు” అనే షో కి ముఖ్య అతిధిగా వచ్చింది. ఈ షోలో “లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా” అనే పాటకు అనన్య అదిరిపోయే డ్యాన్స్ చేసింది. గ్రీన్ డ్రెస్స్ లో అనన్య చేసిన డ్యాన్స్ కి అందరు ఫిదా అయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదలైంది. అనన్య పూర్తి డ్యాన్స్ కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి:
Rashmi Gautam: వీడియో: సుధీర్ ని తలచుకొని ఎమోషనల్ అయిన యాంకర్ రష్మీ!
ఇదీ చదవండి: Puneeth RajKumar: పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! మరో సినిమా రెడీ!