స్పెషల్ డెస్క్- ఇంటర్నెట్ కాలంలో అనుబంధాలకు బీటలు వారుతోంది. కలికాలంలో ప్రేమ కొత్త దారులు తొక్కుతోంది. ప్రేమ.. ఎవరిపై, ఎప్పుడు, ఎందుకు పుడుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఇక ప్రేమకు వయస్సుతో సంబందం లేదని ఇన్నాళ్లు చెప్పుకున్నాం.. ఇక ఇప్పటి నుంచి ప్రేమకు బంధుత్వాలతో, వరసలతో కూడా సంబందం లేదని చెప్పాల్సి వస్తోంది. వావీ వరసలు కూడా ఈ కాలపు ప్రేమకు పట్టడం లేదు. వరసలు మరిచిపోయిన ప్రేమకు ఓ యువతి లవ్ స్టోరీనే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓ అమ్మాయి ఏకంగా తన సోదరుడినే ప్రేమించేసింది. అంతే కాదు అతడితో డేటింగ్ కూడా చేస్తూ అందరికి షాక్ ఇస్తోంది. అంతే కాదు తన సోదరిడితో చివరికి పెళ్లికి కూడా రేడీ అయ్యింది ఆ అమ్మాయి. అదేంటీ సోదరుడితో ప్రేమేంటీ, పెళ్లేంటీ అని అశ్చర్యపోతున్నారా.. అయితే ఇందులో ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నావాళ్లు అన్నాచెల్లెల్లే. కానీ ఒకే తల్లిదండ్రులకు పుట్టినవారు కాదన్న మాట. ఐతే ఆ అమ్మా.యి, అబ్బాయి తల్లిదండ్రులు ఒకరితో ఒకరు సహజీవనం చేశారట. అసలు విషయానికి వస్తే.. మాడ్డీ అనే అమ్మాయి ఇటీవల సీక్రెట్ క్రష్అ నే డేటింగ్ షోలో పార్టిసిపేట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విషయాలు విని అందరూ షాక్ తిన్నారు. తాను తన సోదరుడు కల్లాంతో ప్రేమలో పడ్డానని ఆమె చెప్పుకొచ్చింది.
సోదరుడిని ప్రేమించడం తప్పు అనిపించలేదా అని ఆ షోలో ఎవరో ప్రశ్నించారు. దీనికి.. మా అమ్మ, కల్లం నాన్న చాలా ఏళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.. వారిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.. కానీ, చివరికి విడిపోయారు.. వారిద్దరు విడిపోయినా కల్లాం, నేను.. సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉన్నామని చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. అంతే కాదు కల్లాం పరిపక్వత గల అబ్బాయని, చాలా అందంగాడు కూడా చెప్పింది. అతడు తనకు తొమ్మిదేళ్ల నుంచి తెలుసని.. అందరు అతడు తనకు సోదరుడు అవుతాడని అనుకుంటున్నా.. తాను మాత్రం అతడిని మాజీ సోదరుడిగానే భావిస్తానని తేల్చి చెప్పింది. అంతే కాదు అతడిపై ఉన్న కోరికలను చంపుకోలేకపోయానని పచ్చిగా చెప్పింది. ఇక మాడ్డీ ప్రేమ గురించి తెలుసుకుని కల్లాం ఆశ్చర్యపోయాడట. ఆమె మనసులో మాట చెప్పగానే అతడికి ఫ్యూజులు ఎగిరిపోయాయని చెప్పాడు. ఇక ఆ తరువాత అతడు మాడ్డీ మీద ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరిచాడు. ఆమెతో డేటింగ్ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడట. ఐతే ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్ల పెళ్లికి వాళ్ల తల్లిదండ్రులు, బంధువులు ఒప్పుకుంటారా అన్నదే సందేహం. దీనికి కూడా ఆ అబ్బాయి ధీటుగానే అన్సర్ ఇచ్చాడు. మా నాన్న, ఆమె తల్లి చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేదు కాబట్టి మాది అన్నాచెల్లెళ్ల బంధం కానేకాదు..అని బల్ల గుద్దీ మరి చెప్పాడు. మరి ఎవరెన్ని చెప్పినా పెళ్లి చేసుకోవాలని వీళ్లు నిర్ణయించుకున్నాక ఎవరు మాత్రం ఏంచేస్తారు చెప్పండి.