కొడుకును శృంగార బానిసగా వాడుకుందన్న ఆరోపణలు పెను ప్రకంపనలను సృష్టించాయి. కొడుకును బందించి తనకు భర్తలా వ్యవహరించాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. మాయమాటలు చెప్పి ఆమె ఈ అమానవీయ ఘటనకు పాల్పడ్డట్లు ఆరోపించారు.
సమాజంలో చోటుచేసుకుంటున్న కొన్ని అమానవీయ ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్నాయి. వావివరుసలు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. ప్రేమలో పడి తప్పులు చేస్తున్నది కొందరైతే, వివాహం అయిన తరువాత మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. తమ అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని సొంత పిల్లలను సైతం హతమారుస్తున్నారు. కాగా ఓ మహిళ టీనేజ్ లో ఉన్న తన కొడుకుతో అమానవీయ ఘటనకు పూనుకుంది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మాయమాటలతో మభ్యపెట్టి కన్న కొడుకును శృంగార బానిసగా వాడుకుంది. ఈ ఘటనతో అందరు షాక్ కు గురయ్యారు. అసలు ఈ ఘటన ఎప్పుడు చోటుచేసుకుంది? ఆమె ఎందుకలా వ్యవహరించింది? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
అమెరికాలో ఓ తల్లి తన కొడుకును మాయమాటలతో శృంగార బానిసగా మార్చుకుందని ఫ్యాక్స్ అనే వార్తా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం అక్కడ సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాలో 2015లో 17ఏళ్ల వయసు ఉన్నప్పుడు రూడీ ఫరియస్ అనే టీనేజర్ ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. కాగా ఇటీవల ఓ చర్చ్ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఓ హ్యూమన్ రైట్స్ కార్యకర్త అతడిని గుర్తించి మాట్లాడగా విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే.. రూడి ఫరియస్ అనే టీనేజ్ బాలుడు, జెనీ శాంటన ఇద్దరు తల్లీ కొడుకులు. 2015లో రూడి ఫరియస్ రెండు పెంపుడు శునకాలతో బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు.
శునకాల ఆచూకీ లభ్యం అయ్యింది, కానీ బాలుడు మాత్రం అదృశ్యమయ్యాడు. ఇదిలా ఉంటే మానవ హక్కుల కార్యకర్త క్వానెల్ మాత్రం అతడు ఇన్నిరోజులు తల్లితోనే ఉన్నాడని, కొడుకును శృంగార బానిసగా మార్చుకుందని ఆరోపించాడు. ఇన్ని రోజులు కొడుకును బందించి తనకు భర్తలా వ్యవహరించాలని కోరిందని కాన్వెల్ తెలిపాడు. ఇక ఈ ఘటనపై కొడుకు రూడిని, తల్లి జెనీ శాంటను హ్యూమన్ రైట్స్ కార్యకర్త క్వానెల్ సమక్షంలో పోలీసులు ప్రశ్నించినట్లుగా సమాచారం. మరో వైపు పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ.. తల్లి కుమారుడిని వేధించినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, ఆ ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేయబోమని అధికారులు తెలిపారు. మొత్తానికి ఈ ఘటన అమెరికాలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.