ఆమె అక్కడినుంచి బయలు దేరింది. అతడు ఆమెను దాదాపు 234 కిలో మీటర్ల వరకు వెంటాడాడు. అంతటితో ఆగకుండా ఓ చోట అడ్డగించాడు. అతడి కారణంగా ఆమె ఎందకూ పనికి రాకుండా పోయాడు.
మనుషుల్లో మానవత్వం నశిస్తోంది అని చెప్పటానికి నిత్యం కొన్ని వందల సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నేరగాళ్లు తమ స్వార్థం కోసం దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఓ దొంగ మహిళను దోచుకోవటానికి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. డబ్బు తీసుకుని పారిపోవాల్సిన అతడు ఆమె జీవితాన్ని వీల్‌ఛైర్‌కు పరిమితం చేశాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమెరికాలోని హోస్టన్‌కు చెందిన న్యాంగ్ థ్రాంగ్ అనే 44 ఏళ్ల మహిళ తన ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. ఫిబ్రవరి 13న ఆమె బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏటీఎమ్‌లో దాదాపు 4 వేలకు పైగా డాలర్ల డబ్బును డ్రా చేసుకుంది. ఇది అక్కడే ఉన్న ఓ దొంగ గమనించాడు.
డబ్బు డ్రా చేసుకోగానే.. ఆమె అక్కడినుంచి బయలు దేరింది. ఆ దొంగ ఆమెను ఫాలో అయ్యాడు. దాదాపు 23 కిలో మీటర్లు వెంటాడాడు. ఓ చోట ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఆమెను అడ్డగించాడు. ఆమె దగ్గర ఉన్న డబ్బు కవర్‌ను లాక్కున్నాడు. వెంటనే అక్కడినుంచి పారిపోతూ మళ్లీ ఆమె దగ్గరకు వచ్చాడు. విచక్షణా రహితంగా ఆమెపై దాడి చేశాడు. ఆమె తన చేతులతో గట్టిగా పట్టుకుని పైకి లేపాడు. తర్వాత బలంగా నేలకేసి కొట్టాడు. దీంతో ఆమె వెన్నెముకకు పెద్ద దెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆమె అక్కడే కుప్పకూలింది. దొంగ డబ్బుతో అక్కడినుంచి పారిపోయాడు.
గాయాలతో పడిఉన్న ఆమెను గమనించిన వాహనదారులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెన్నెముకకు గాయం కావటం వల్ల న్యాంగ్ థ్రాంగ్ నిలవబడడానికి కూడా వీలు లేకుండాపోయింది. వీల్ ఛైర్‌కు పరిమితం అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరి, దొంగ కారణంగా వీల్ ఛైర్‌కు పరిమితం అయిన ఈ మహిళ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.