ఉత్తర అమెరికా తెలుగు సంఘం డైరెక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విని తానా సభ్యులు మాత్రమే కాదు.. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద కుమార్తెను తీసుకువచ్చేందుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెవీ పికప్ ట్రక్ ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హ్యూస్టన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు.
కొడాలి శ్రీనివాస్ భార్య వాణి సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. పెద్ద కుమార్తె వైద్య విద్యను అభ్యిసిస్తున్నారు. చిన్న కుమార్తె 11వ తరగతి చదువుతోంది. దసరా సందర్భంగా పెద్దామ్మాయిని ఇంటికి తీసుకొచ్చేందుకు శ్రీనివాస్ భార్య వాణి- చిన్నమ్మాయి కలిసి వెళ్లారు. పెద్దమ్మాయిని తీసుకుని తిరిగి వస్తుండగా వారి లెక్సస్ కారుని హెవీ పికప్ ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఒకరిని ఆస్పత్రికి తరలించాక మరణించినట్లు తెలుస్తోంది. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ స్వస్థలం కృష్ణా జిల్లా కురుమద్దాలి. ఆయన 1995లో హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లారు. అక్కడే వైద్యుడిగా స్థిరపడిపోయారు. నాగేంద్ర శ్రీనివాస్ 2017 నుంచి తానా బోర్డు మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. కుటుంబాన్ని కోల్పోయిన శ్రీనివాస్‌కు తానా సభ్యులు, నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
TANA Board of Director & NATS Board member Dr. Nagendra Srinivas Kodali’s wife (Vani) & his two beautiful daughters met with a terrible accident in Houston, U.S yesterday, three of them passed away.
First girl was 6 years Med program. Second daughter 11th grade. OM SHANTHI 🙏 pic.twitter.com/XysAWgQmnn
— MIRCHI9 (@Mirchi9) September 26, 2022