ప్రేమ అనే రెండు అక్షరాలతో పదంతో పాటు మానవత్వం అనే నాలుగు అక్షరాల పదంకూడా ఉంటే మనిషి జన్మసార్ధకం అవుతోంది. కష్టపడి డబ్బులు సంపాదించే వారు గొప్పవారు. అయితే ఆ ధనాన్ని పరులకి నిస్వార్ధంగా దానం చేసిన వారు మహోన్నతులు అవుతారు. కర్ణుడు.. తన సహజ కవచకుండాలను దేవేంద్రుడు అడిన వెంటనే దానం చేసి చరిత్రలో నిలిచిపోయారు. అలానే ఈ కలియుగంలో కూడా అలాంటి దానం చేసిన కొందరు అభినవ దాన కర్ణులుగా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వ్యక్తే అమెరికాకు చెందిన గొప్ప వ్యాపారవేత్త వైవోన్ చౌనార్డ్. తన రూ.24 వేల కోట్ల ఆస్తిని తృణ ప్రాయంగా దానం చేశాడు. మరి.. ఆ గొప్ప వ్యక్తి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…
అమెరికాకు చెందిన వైవోన్ చౌనార్డ్(83) గొప్ప వ్యాపార వేత్త. పటగోనియా అనే రిటైలర్ అనే కంపెనీ 1973లో స్థాపించారు. ఈ కంపెనీ తయారు చేసిన అవుట్ డోర్ దుస్తులను అనేక దేశాల్లో విక్రయిస్తోంది. చౌనార్డ్ కి పర్యావరణం, జీవ వైవిధ్యం కాపాడేందుకు ఎంతో కృషి చేస్తుంటారు. తన కంపెనీలో వచ్చే ఆదాయంలో కొంత పర్యావరణానికి ఉపయోగించే వారు.ఇటీవల న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం చౌనార్జ్ కంపెనీ విలువ సుమారు. 3 బిలియన్ల డాలర్లు .. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.24 వేల కోట్లు ఉంటుంది. ఈ విలువైన కంపెనీని వాతావరణంలో వచ్చే సంక్షోభాలను ఎదుర్కోవడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు వినియోగించాలనే సద్దుద్దేశంతో వైవోన్ చౌనార్డ్ విరాళంగా అందజేశారు. అయితే వైవోన్ చౌనార్డ్ నిర్ణయం అందరిని ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ వైవోన్ గురించి తెలిస్తే.. అందులో ఎటువంటి అతిశయోక్తి కలగదు. ఎందుకంటే వైవోన్ చౌనార్డ్ చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి.
అయితే విరాళంలో ఆయనతో పాటు భార్య, పిల్లలు కూడా ఈ కంపెనీలోని తమ వాటాలను కూడా ఇచ్చేస్తున్నారు. తన నిర్ణయంతో పాటు కుటుంబ సభ్యుల మాటను తెలియజేస్తూ వైవోన్ కంపెనీ బోర్డుకు ఓ లేఖ కూడా రాశారు. అందులో “ఇప్పుడు మన కంపెనీలో భూమి ఇప్పుడు మా ఏకైక వాటాదారుడు. భూమి, పర్యావరణ గురించి ఏదైనా చేయాలనే ఆశ ఉంటే.. మన దగ్గర ఉన్న వనరులతో మనం చేయగలినదంతా చేయాలి” వైవోన్ లేఖలో పేర్కొన్నారు. ఆ లెటర్‌ను బుధవారం పటగోనియా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. రూ.100 దానం చేయడానికి వందసార్లు ఆలోచించే ఈ కాలంలో వందల, వేల కోట్లను తృణ ప్రాయంగా పర్యావరణం కాపాడేందుకు దానం చేసిన ఈ వ్యక్తి గ్రేట్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. చౌనార్డ్.. అభినవ దానకర్ణుడు అని మరికొందరు కామెంట్స్ చేశారు. మరి.. ఈ అభినవ దాన కర్ణుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
El fundador de Patagonia, Yvon Chouinard, cedió la empresa, con valor de 3000 millones de dólares, a fideicomisos y entidades sin fines de lucro para combatir el cambio climático. https://t.co/HZsJv2WF21
— The New York Times (@nytimes) September 15, 2022