ఓ హెలికాప్టర్ అప్పుడే టేకాఫ్ అయింది. అందులో పలువురు ఎంపీలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. జస్ట్ కొన్ని మీటర్ల దూరం గాల్లోకి ప్రయాణించిన తర్వాత ఓ చోట హైటెన్షన్ కరెంట్ వైర్లని, ఆ హెలికాప్టర్ ఢీ కొట్టింది. అంతే ఒక్కసారిగా అది కిందపడిపోయింది. మంటలు చెలరేగాయి. దగ్గర్లో ఉన్నవాళ్లు ఒక్కసారి భయబ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరిగిందని.. ఆ హెలికాప్టర్ దగ్గరకు పరుగుపరుగున వెళ్లారు. ఇంతకీ ఈ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. విమానం, హెలికాప్టర్స్ నడిపే పైలెట్స్ చాలా జాగ్రత్తగా అనుక్షణం ఎదురుగా ఏం ఉందనేది చూస్తూ ఉండాలి. లేదంటే చిన్న చిన్న పక్షులు, గాల్లో ఉండే కొన్నింటి వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశముంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఓ సంఘటనే బ్రెజిల్ లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలో జరిగింది. ఆ దేశానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు.. మరో ఊరికి వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కారు. కాస్త దూరం వెళ్లి, హైటెన్షన్ కరెంట్ వైర్లని తాకిన ఆ హెలికాప్టర్, కింద పడిపోయింది.
మంటలు చెలరేగకముందే పైలెట్ తో సహా అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు క్షేమంగా బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్.. అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రజాప్రతినిధులందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. వాళ్లు ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు. ఇదిలా ఉండగా, పైలెట్ నియంత్రణ కోల్పోవడం వల్లే, ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Moments helicopter hits power line and crashes in Brazil
Horrifying moment helicopter hits power line and crashes – but Brazilian congressman, deputy mayor, staffer and pilot all survive #trendingvideos pic.twitter.com/8DmZOwOv3v— 6IX WORLD NEWS (@6ixworldnews) September 23, 2022
ఇదీ చదవండి: స్కూల్ డ్రాపౌట్ ప్రతిభ.. ఏకంగా హెలికాప్టర్ తయారు చేశాడు!
ఇదీ చదవండి: 100 కోట్ల లగ్జరీ హెలికాప్టర్ కొన్న మొదటి భారతీయుడు.. దీని స్పెషాలిటీ ఏంటి?