ఈ మధ్యకాలంలో భర్యాభర్తల మధ్య గొడవలు రచ్చగా మారి బజారున పడుతున్నాయి. ఇంతటితో ఆగుతున్నాయా అంటే అదీ లేదు. ఇలా భార్యభర్తల మధ్య వివాదం రచ్చకకెక్కటంతో అత్త రంగంలోకి దిగి ఏకంగా సొంత అల్లుడినే దారుణంగా హత్య చేసింది. తాజాగా జరిగిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతంలోని రాంకీ విలాస్ మార్గంలో చోటు చేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. క్రిష్ణ అనే వ్యక్తికి తొమ్మిదేళ్ల క్రితం ఓ యువతితో పెళ్లి జరిగింది. కొన్నాళ్లపాటు వీరి వివాహ జీవితంలో భార్యభర్తలు సంతోషంగా కలిసి మెలిసి ఉన్నారు. రాను రాను భర్త క్రిష్ణ ఆగడాలు మాత్రం మితిమీరుతున్నాయి. భార్యపై వేధింపులకు గురి చేస్తూ..తీవ్రంగా హింసించేవాడు. దీంతో కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న అత్త యాదమ్మ అల్లుడిని తీరు మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించే ప్రయత్నం చేసింది. మనోడి తీరు మాత్రం రాను రాను శృతిమించిపోతోందే తప్పా వెనక్కి తగ్గటం లేదు.
ప్రతీ రోజు మద్యం తాగి తన కూతురుని నరకయాతనకు గురి చేసేవాడు. ఇలా కాదని భావించిన అత్త యాదమ్మ ఏకంగా అల్లుడి క్రిష్ణ మార్డర్ కే కన్నం వేసింది. ఒక రోజు తన కూతురిపై అల్లుడి హింసను భరించని అత్త చీరతో ఉరి వేసి దారుణంగా హతమార్చింది. ముందుగా తనే అతిగా మద్యం సేవించి చనిపోయాడన్న కోణంలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు రంగంలోకి దిగటంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వెంటనే పహాడీషరీఫ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.