కట్నం కోసం కోడలును వేధించిన ఘటనల గురించి వినుంటారు. వార్తల్లోనూ వచ్చిన ఇలాంటి ఘటనలు చూసుంటారు. అయితే ఇక్కడ ఓ అత్త మాత్రం డబ్బులపై ఆశతో కోడలి రక్తాన్ని అమ్మేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
దేవుడి మీద భక్తి, నమ్మకం ఉండాలి. కానీ మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు ఉండకూడదు. కానీ కొందరు మాత్రం ఇలాంటి వాటిని నమ్ముతూ మోసపోతుంటారు. తమ చుట్టూ ఉండేవారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అఘోరీ పూజ కోసం చనిపోయిన మనిషి ఎముకలతో తయారు చేసిన పౌడర్‌ను భార్యతో భర్త కుటుంబీకులు బలవంతంగా తినిపించిన ఘటన గురించి వార్తల్లో విన్నాం. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది. అలాంటి మరో ఆశ్చర్యకరమైన ఘటన పూణెలో చోటుచేసుకుంది. డబ్బులపై ఆశతో కోడలి రక్తాన్ని అమ్మేసిందో అత్త. పూణెలోని విశ్రాంతివాడికి చెందిన బాధితులురాలు బీడ్ జిల్లాలో భర్త, అత్తామామలతో కలసి ఉండేది.
పెళ్లయిన కొన్ని రోజుల నుంచే ఆమెను కట్నం కోసం వేధించేవారు. ఈ క్రమంలో ఒక నెలలో కోడలి బహిష్టు ఉండగా.. ఆమెను కట్టేసి, కోడలి రక్తాన్ని దూదితో సేకరించారు అత్తామామలు. ఆ రక్తాన్ని సీసాలో నింపి మంత్రగాడికి రూ.50 వేలకు విక్రయించారు. ఈ ఘటన గురించి తన తల్లిదండ్రులకు చెప్పుకుని కన్నీటిపర్యంతమైంది బాధితురాలు. ఎన్జీవో సాయంతో బాధితురాలి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మరి.. డబ్బులపై ఆశతో కోడలి రక్తాన్ని అత్త అమ్ముకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.