బజాజ్ ఫైనాన్స్ భాగస్వామ్యంతో మా కస్టమర్లు, డీలర్లకు ఆర్థిక లావాదేవీలు - పరిష్కారాలు అందుబాటులోకి తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశ్యం’’ అని అన్నారు.
ప్రముఖ న్యూ ఎనర్జీ వెహికల్ తయారీదారి సంస్థ ‘‘బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్’’ రుణ విభాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో బీఐడీ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లను ప్రోత్సహించడం కోసం, అదే విధంగా బీవైడీ డీలర్లు, వినియోగదారులకు సమగ్ర వాహన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. ఇరు సంస్థల అధికారులు ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బీవైడీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ.. “బజాజ్ ఫైనాన్స్‌తో మా భాగస్వామ్యం బీవైడీ ఇండియాకు మరో ముఖ్యమైన మైలురాయి.
బజాజ్ ఫైనాన్స్ భాగస్వామ్యంతో మా కస్టమర్లు, డీలర్లకు ఆర్థిక లావాదేవీలు – పరిష్కారాలు అందుబాటులోకి తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశ్యం’’ అని అన్నారు. అనంతరం బజాజ్ ఫైనాన్స్ ఎస్ఎమ్ఈ, ఆటో ప్రెసిడెంట్ సిధాంత్ దద్వాల్ మాట్లాడుతూ.. ‘‘ ఇటీవలి సంవత్సరాలలో ఎలక్ట్రిక్ వాహనాలు జనాదరణ పొందుతున్నాయి. బీవైడీ ఈవీ మార్కెట్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆటో ఫైనాన్సింగ్ మార్కెట్లో కస్టమర్లు ఎలాంటి అవాంతరాలు లేని క్రెడిట్ యాక్సెస్‌ను ఆశిస్తున్నారు. బీవైడీ ఇండియాతో కలిసి, మంచి ఆర్థిక సంబంధాలను కలిగి ఉండటానికి ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు. కాగా, బీవైడీ ఇండియా.. మార్చి 2007లో చెన్నైలో స్థాపించబడింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ ఫోర్క్‌లిఫ్ట్‌లు, ఎలక్ట్రానిక్స్, విడి భాగాలను తయారు చేస్తోంది.