ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పూర్తయింది. ఈ భేటిలో పలు కీలక అంశాలపై కేబినేట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించాలని కేబినేట్ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ-డబ్ల్యూఎస్‌కు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడానికి, అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేసే అంశాన్ని కేబినెట్ ఆమోదించింది.
– స్వరూపానందేంద్ర సరస్వతికి చెందిన విశాఖ శారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపు
– జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్ కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపు
– రాష్ట్రంలో ఐదు చోట్ల సెవెన్ స్టార్ పర్యాటక రిసార్ట్ ల ఏర్పాటుకు భూముల కేటాయింపు
– వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
– అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటుకు ఆమోదం
– పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
– జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు
– సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు ఆమోదం
– బీసీ జనాభాను కులాలవారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం
– విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టుకు ఆమోదం
– రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం
– ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు (యూనిట్ రూ. 2.49 చొప్పున) ప్రతిపాదనకు ఆమోదం
– ప్రకాశం జిల్లా వాడ్రేవు సహా 5 ఫిషింగ్ హార్బర్ల్ డీపీఆర్‌లకు గ్రీన్ సిగ్నల్
– కొత్తగా 1,285 ఉద్యాగాల భర్తీకి మంత్రివర్గం అంగీకారం
– అర్బన్ హెల్త్ క్లినిక్స్‌లో 560 ఫార్మాసిస్టులు, వైద్య కళాశాలల్లో 2,190 మంది నియామకానికి ఆమోదం