ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంటుంది. అదే సమయంలో ఉద్యోగులకు కొన్ని వరాలను ఇస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పలు ధపాలుగా నెరవేర్చుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంటుంది. అదే సమయంలో ఉద్యోగులకు కొన్ని వరాలను ఇస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పలు ధపాలుగా నెరవేర్చుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం. నవరత్నాలను అందిస్తూ ప్రజలకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. అయితే రాబోయే ఎన్నికల నేపథ్యంలో పలు అంశాలపై దృష్టి సారిస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. ఇందులో సానుకూల నిర్ణయాలను తీసుకుంది. అలాగే స్టేట్ ఇన్వెస్టెమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అయితే ఇంకా ఏఏ నిర్ణయాలు తీసుకున్నారంటే..
మూడున్నర గంటలపాటు సాగిన కేబినెట్ భేటీలో 55 అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అసైన్ మెంట్ ల్యాండ్స్, నిరుపేదలకు ఇచ్చే భూములపై మెచ్చుకోదగిన నిర్ణయం తీసుకంది. వ్యవసాయ భూమి, లంక భూములపై పూర్తి హక్కులు లబ్ధిదారులకే కేటాయించాలని నిర్ణయించింది. మొత్తం 63,191,84 ఎకరాల అసైన్‌మెంట్ ల్యాండ్స్, లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ ల్యాండ్ పొందిన లబ్దిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా మంత్రి వర్గం సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతులు మాదిరిగానే వారికి క్రయ-విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి. అలాగే 1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటుకు నిర్ణయిం తీసుకుంది. అలాగే డ్వాక్రా మహిలలకు సున్నా వడ్డీ పథకం అమలుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
అమరావతి సీఆర్‌డీఏ పరిధిలోని ఆర్5జోన్‌లో 47 వేల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా యూనివర్శిటీల్లో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచింది. రిటైర్ మెంట్ వయస్సు 60 నుండి 65కు పెంచతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అర్చకులకు తీపి కబురు చెప్పింది. అర్చకుల రిటైర్ మెంట్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. వీరి రిటైర్ మెంట్ వయస్సు 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచుతూ ఆమోదం తెలిపింది. దేవాదాయ శాఖలో పనిచేసే శాశ్వత ఉద్యోగులందరికీ కూడా పదవీ విరమణ వయస్సు రెండేళ్లు పెరగనుంది. అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పంపెడ్ స్టోరేజీ ప్రాజెక్టుకి ఆమోదించింది. గండికోట రిజర్వాయరు ప్రాజెక్టు నిర్వాహితులకు రూ. 454 కోట్ల పరిహారం ప్యాకేజీ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.