ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంటుంది. అదే సమయంలో ఉద్యోగులకు కొన్ని వరాలను ఇస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పలు ధపాలుగా నెరవేర్చుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పూర్తయింది. ఈ భేటిలో పలు కీలక అంశాలపై కేబినేట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించాలని కేబినేట్ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ-డబ్ల్యూఎస్‌కు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడానికి, అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేసే అంశాన్ని కేబినెట్ ఆమోదించింది. – స్వరూపానందేంద్ర సరస్వతికి చెందిన […]