ఆనాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్రలో వర్గాల బేధం, ప్రాంతాల బేధం, పార్టీల బేధం చూపించకుండా ప్రజల సమస్యలపైనే సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో షర్మిల పాదయాత్ర చేశారు. అధిక పాదయాత్ర చేసిన మొదటి మహిళగా షర్మిల రికార్డ్ సృష్టించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ప్రియదర్శిని రామ్. అయితే, తాజాగా ఆయన సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలు పంచుకున్నారు.
వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ప్రారంభమైన షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇందులో పార్టీ నేతలు, కార్యకర్తలు షర్మిల వెంట అడుగులో అడుగులు వేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ నేతలతో భేటీ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే..? ఈ రోజు రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం నుంచి పాదయాత్ర […]
రాజకీయాల్లో ఎప్పుడు, ఏమి జరుగుతుందో.. చెప్పలేము. ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాలను అంచనా వేయడం విశ్లేషకులకు సైతం అంతు పట్టదు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలే నెలకొన్నాయి. 151 సీట్లతో అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డికి పార్టీ నేతల నుండి ఎలాంటి సమస్యలు లేవు. కానీ.., ఈ మధ్య కాలంలో ఆయనకి కుటుంబ కష్టాలు ఎక్కువ అయ్యాయి. ఒకవైపు చెల్లలు షర్మిల పార్టీకి పూర్తిగా దూరం అయిపోయింది. […]
నర్పాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు మరో సారి సీఎం జగన్‌పై హాట్ కామెంట్ చేశారు. ఎప్పుడు పార్టీ గురించి తన పరిపాలన గురించి పెదవి విప్పే RRR ఈ సారి ఏకంగా జగన్ ఆస్తులపై హాట్ హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రతీ రోజు ఏదో ఒక అంశంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖల రాస్తూ వార్తల్లో కొనసాగారు. అయితే ఈ సారి మాత్రం జగన్ […]
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ సినిమాని తలపిస్తున్నాయి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగడంతో నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలు నిశ్శబ్దంగా ఉంటూనే వచ్చాయి. ఎప్పుడైతే ఈటల ఎపిసోడ్ తెరపైకి వచ్చిందో అప్పటి నుండి పరిస్థితిలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒకవైపు హుజురాబాద్ ఉపఎన్నిక హీట్ పుట్టిస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాల ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ అధికార పార్టీని కాస్త కలవర పెడుతున్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం తెలంగాణలో ఆ పార్టీకి కలసి […]