నర్పాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు మరో సారి సీఎం జగన్‌పై హాట్ కామెంట్ చేశారు. ఎప్పుడు పార్టీ గురించి తన పరిపాలన గురించి పెదవి విప్పే RRR ఈ సారి ఏకంగా జగన్ ఆస్తులపై హాట్ హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రతీ రోజు ఏదో ఒక అంశంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖల రాస్తూ వార్తల్లో కొనసాగారు. అయితే ఈ సారి మాత్రం జగన్ ఆస్తుల గురుంచి మాట్లాడారు రఘురామ.
2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అఖండ విజయాన్ని సాధించడంలో వైఎస్ షర్మిల పాత్ర కూడా ఎంతో ఉందని తెలిపారు. అందుకు తన ఆస్తుల్లో ఆమెకు సగ భాగం ఇవ్వాలని కోరారు. ఇక తాజాగా విజయసాయిరెడ్డి అశోక్ గజపతి రాజు సోదరుడైన ఆనంద గజపతి రాజు కుటుంబానికి డబ్బులు ఇవ్వటం లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనికి ధీటుగానే రఘురామ స్పందించాడని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక రఘురామను ఎంపీగా తప్పించేందుకు వైసీపీ పెద్దలు చేయని ప్రయత్నాలు లేవనే చెప్పాలి. అధికార పార్టీలో ఉంటూ వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు రఘురామరాజు. ఇక రఘురామ జగన్ ఆస్తులై చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.