వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ప్రారంభమైన షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇందులో పార్టీ నేతలు, కార్యకర్తలు షర్మిల వెంట అడుగులో అడుగులు వేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ నేతలతో భేటీ అవుతుంది.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే..? ఈ రోజు రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. కాగా అడుగడుగున ప్రజలు షర్మిలకు బ్రహ్మరధం పడుతు స్వాగతం పలుకుతున్నారు. ఇక షర్మిల పాదయాత్రలో భాగంగా ఓ ఊహించని ఘటన ఎదురైంది. వైసీపీ నేత, సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి షర్మిలను కలిసి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి సంఘీభావం తెలపటంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. షర్మిల పాదయాత్ర దాదాపుగా 400 రోజులు 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగనుంది. అయితే మొత్తానికి 14 పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.