అంతర్జాతీయ వేదికల్లో భారత్ తరుపున ఆడి, పతకాలు గెలిచి, కీర్తి, ప్రఖాత్యలు తీసుకువస్తున్న క్రీడాకారులు.. తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్లెక్కుతున్నారు. దేశానికి పేరు తీసుకు రాగానే.. అభినందనలతో ముంచెత్తే కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు న్యాయం చేయండని రెజ్లర్లు పెడుతున్న గగ్గోలును వినిపించుకోవడం లేదు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారత టాప్ రెజ్లర్లు ధర్నాకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో చాలా మంది ప్రముఖులు, సామాన్యులు స్పందిస్తున్నారు. రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ, వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
సుశీల్ కుమార్. వరల్డ్ రెజ్లింగ్‌లో అతనో ఐకాన్. ఇండియా స్పోర్ట్స్ హిస్టరీలోని గొప్ప అథ్లెట్లలో ఒకడు. అయినా సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ పీకల్లోతు ఇరుక్కుపోవడానికి కారణం, సాగర్, అతడి ఇద్దరు మిత్రులపై సుశీల్ బృందం హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో దాడి చేసినట్లుగా వెల్లడైన సంగతి తెలిసిందే. నిందితుల్లో ఒకడైన ప్రిన్స్ దాడి ఘటనను వీడియో తీయగా సాగర్ చనిపోయిన రెండు రోజుల తర్వాత అతణ్ని అదుపులోకి తీసుకున్నపుడు తన మొబైల్ పరిశీలించగా అది బయటపడింది. […]