టోక్యో ఒలంపిక్స్‌లో ఎట్టకేలకు భారత రెజ్లర్ రవికుమార్ దహియా అద్భుతం చేసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. హోరాహోరిగా సాగిన సెమీ ఫైనల్‌లో ప్రత్యర్థి నురిస్లామ్ ఎత్తులను తిప్పికొట్టి తన సత్తాను చూపించాడు. సెమీ ఫైనల్ పోరులో భాగంగా రెజ్లర్ రవికుమార్ దాహియా కజక్‌స్తాన్ కుస్తీవీరుడు సనయెవ్ నురిస్లామ్‌తో పోటీ పడి7-9 తేడాతో ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో టోక్యో ఒలంపిక్స్‌లో 57 కిలోల విభాగంలో రవికుమార్ ఫైనల్‌లో ప్రత్యర్థిపై తలపడనున్నాడు.
ఇక సెమీ ఫైనల్‌లో ఒక్కో రౌండ్‌లో ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినా మొదట్లో రవికుమార్ కాస్త వెనకబడ్డాడు. దీంతో ఒటమి ఖాయంగా కనిపిస్తుందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే రవికుమార్ అనుహ్యంగా పుంజుకుని ప్రత్యర్థి నురిస్లామ్ లేవకుండా దెబ్బకొట్టాడు. అంతే రవికుమార్ తన వ్యూహాలతో మెల్లమెల్లగా దూకుడు పెంచి చివరికి నురిస్లామ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ దెబ్బతో భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేశాడు రవికుమార్.
ఎలాగో ఫైనల్‌కు చేరాడు. ఇక గెలిస్తే బంగారు పతకం, ఓడితే రజతం పతకం రావటం ఖాయం. రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన రెండో ఆటగాడిగా పెరుకెక్కారు రవికుమార్. ఇక ఫైనల్‌లో తలపడబోయే రెజ్లర్ రవికుమార్ ఎలాగైన భారత్ “బంగారం”లాంటి అశను బతికిస్తాడని అందరూ అనుకుంటున్నారు. మరి ఫైనల్‌లో రవికుమార్ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని తీసుకొస్తాడో లేదో చూడాలి మరి.