విశాఖలో ఓ వాలంటీర్ వృద్ధురాలిని చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో వాలంటీర్ హైటెక్ మోసం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఏకంగా ప్లాస్టిక్ వేలి ముద్రలు వేస్తూ అడ్డంగా బుక్కైపోయాడు.
విశాఖలో దారుణం నెలకొంది. వాలంటీర్ ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ సంఘటన నగరం మొత్తం కలకలం రేపింది. వృద్ధురాలు హత్యగావింపబడినట్లు సీసీ కెమెరాలోని దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వాలంటీర్ సేవలను మొదలు పెట్టారు సీఎం జగన్. గ్రామ స్థాయిలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా.. గ్రామ వాలంటీర్ వెంటనే స్పందించి వారికి న్యాయం చేసేలా వీరిని నియాకమం చేశారు. కానీ కొంత మంది వాలంటీర్లు చేస్తున్న నిర్లక్ష్య వైఖరి, మోసాల వల్ల గ్రామస్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పెన్షన్ పేరుతో వృద్ధురాలిని నమ్మించాడో గ్రామ వాలంటీర్. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆస్తికే […]