ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వాలంటీర్ సేవలను మొదలు పెట్టారు సీఎం జగన్. గ్రామ స్థాయిలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా.. గ్రామ వాలంటీర్ వెంటనే స్పందించి వారికి న్యాయం చేసేలా వీరిని నియాకమం చేశారు. కానీ కొంత మంది వాలంటీర్లు చేస్తున్న నిర్లక్ష్య వైఖరి, మోసాల వల్ల గ్రామస్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పెన్షన్ పేరుతో వృద్ధురాలిని నమ్మించాడో గ్రామ వాలంటీర్. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆస్తికే ఎసరు పెట్టాడు. చివరికి అది కాస్త బయట పడి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
తూర్పుగోదావరి జిల్లాకాకినాడ రూరల్ చీడిగలో వాశంశెట్టి మంగాయమ్మ అనే వృద్ధురాలి కి పెన్షన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అగ్రిమెంట్ స్టాంప్ పేపర్లపై వేలిముద్రలు వేయించుకున్నాడు. ఈ క్రమంలో ఏకంగా 30 లక్షల రూపాయల ఆస్తిని కాజేసేందుకు స్కెచ్ వేశాడు వాలంటీర్. ఇది జరిగిన 45 రోజుల తర్వాత మంగాయమ్మ చిన్న కోడలు సత్యవేణి పేరుతో లాయర్ నోటీసు రావడంతో వాలంటీర్ అసలు బండారం బయటపడింది. మంగాయమ్మకు అందిన నోటీసులో 30లక్షల రూపాయల ఆస్తిని సత్యవేణికి అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు.. అప్పటికే 25 లక్షలు చెల్లించినట్లు ఉంది. మిగతా ఐదు లక్షల రూపాయలు తీసుకుని ఆస్తిని సత్యవేణి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయాలని నోటీసులో ఉంది. ఈ విషయం తెలిసి తాను ఎవరికీ ఆస్తి వ్యవహారాల లావాదేవీలు చేయలేదని.. తానను ఎవరో మోసం చేస్తున్నారని నివ్వెరపోయింది.
ఇది చదవండి : ఆ పండు కోయాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే…
ఇక ఎంపీటీసీగా ఉన్న సత్యవేణి, విశ్వనాథం దంపతులు. విభేదాలతో కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది సత్యవేణి. రాజకీయ బలంతో గ్రామ వాలంటీర్ రవికుమార్‌తో కుమ్మక్కై అమాయకురాలైన తన తల్లి మంగాయమ్మ నుంచి వేలిముద్రలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు విశ్వనాథం. తమకు నోటీసులు వచ్చిన తర్వాత వీరి భాగోతం బయట పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు విశ్వనాథం. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో కలెక్టర్‌ను ఆశ్రయించారు. న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు మంగాయమ్మ ఆమె కొడుకు విశ్వనాథం. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.