సాధించాలనే పట్టుదల దానికి తగిన కృషి చేస్తే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించవచ్చని నిరూపిస్తున్నారు పేదింటి బిడ్డలు. అకుంఠిత దీక్షతో రాత్రి పగలు చదివి కన్నోల్ల కలల్ని వారి కష్టాన్ని వమ్ము చేయకుండా వారి ఆశయాలను సాధిస్తున్నారు.
సమాజంలో నేరాలను నియంత్రించి, శాంతి భద్రతలను కాపాడటంలో రక్షణ వ్యవస్థదే కీలక పాత్ర. ప్రజా సేవ చేయాలనే ఆశయంతో పోలీస్ ఉద్యోగాలు సాధించడం కోసం అహర్నిశలు కష్టపడ్డి చదివి తుది పరీక్షలు రాసిన కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థలకు టిఎస్ ఎల్ పిఆర్ బి శుభవార్త అందించింది.
ఎస్ఐ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 'టీఎస్పిఎల్ఆర్బి' కీలక ప్రకటన చేసింది. తుది రాత పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ పరీక్షలు మూడు జిల్లాల్లో మాత్రమే జరగనున్నాయి. హాల్ టిక్కెట్లు ఎప్పటినుండి డౌన్ లోడ్ చేసుకోవాలి..? పరీక్ష తేదీలు..? వంటి పూర్తి వివరాలు కోసం కింద చదివేయండి.
రాష్ట్రంలో పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపకశాఖల్లో మొత్తం 17,516 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా.. 7,33,559 అభ్యర్థులు మొత్తంగా 12,91,006 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా 51% దరఖాస్తులు బీసీ వర్గాల నుంచి రావడం విశేషం. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి 41% దరఖాస్తులు రాగా, ఓసీ సామాజిక వర్గం నుంచి 7.65% దరఖాస్తులు వచ్చాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే.. యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల పట్ల అగ్రవర్ణాలతో పోలిస్తే బడుగు, బలహీనవర్గాలు అత్యంత […]